కీర్తన 214
-----
ఎక్కాడున్నోడో నాసామి ఏడుకొండలవాడు
ఎందునున్నాడో నాసామి ఏడుకొండలవాడు
ఎంత వెదికినా కానరాడు ఎంత వేడినా దొరకరాడు
పంత మిడిచి పలుకు వినరాడు ప్రేమతో పలుకరాడు
బెట్టు చేద్దామంటే మనసు మాట వినక పోయే
ఇట్టు వద్దాములే అని ఆసామి అనుకోక పోయే
ఏరీతిన కొలిచిన ఎదురేగి వస్తాడో ఎరుక కాకపోయే
ఏరువాకై ఏడుకొండలవాడు కరుణతో సాగిరాకపోయే
నే పోలేక నాసామి రాలేక చిక్కుముడి కొలిక్కిరాక
అడకత్తెరలో పోకచెక్క సామెతాయె నా బతుకు
ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందాగోవింద
No comments:
Post a Comment