కీర్తన 235
-----------
కాంతా మాయామోహనమాయె నా మనసుకాంతినిచిమ్మే చింతన కలుగకపోయెనే నా మనసు
కాంత మోహనుడై కోరరానివి కోరితినయ్యా కౌశల్య రామ
చింతన చేయక చేయరానివి ఎన్నో చేసితీనయ్యా సీతా రామ
బంధాలన్నీ పులుముకొంటిని పాపాలన్నీమూటగట్టుకొంటినయ్యా

అజ్ఞానముతో అంధకారములో అలరించుచున్నదే నా మనసు
సుజ్ఞానముతో సుస్వరాగభరితమై సేవించేదెన్నడో నా మనసు
చెడు విలక్షణాలను చెంతచేర్చుకొని సంబరాననున్నదే నా మనసు
జ్ఞానవిచక్షణతో ధర్మార్ధకామమోక్షపరిరక్షకునికి దాసుడయ్యేదెన్నడో నా మనసు

వింతమాయ తొలిగేదెన్నడో కాంతా మోహము వీడేదెన్నడో
చితిలోనైనా కాంతమోహము కోరునో లేక చింత చేయునో
ఆశ్రితపాలక మోక్షదాయక మన్నించి ముక్తిమార్గమున మళ్లించు రామ

No comments:
Post a Comment