Sunday, December 14, 2014

కీర్తన 45
----------
నిన్న రాదన్న.. రేపూ లేదన్న.. నేడే నీదన్న..
కొలవరా ఒరన్నా నమ్మరా నరుడన్నా
హరిహరియంటూ హరినామం తలవరా ఒరన్నా
ఆనందం లేదన్న.. అందరు కాదన్న...
బంధాలు వలదన్న... బ్రతుకే బారమన్నా..
కొలవరా ఒరన్నా నమ్మరా నరుడన్నా
హరిహరియంటూ హరినామం తలవరా ఒరన్నా
నీబాటే పూలబాటనవునన్నా
సిరులే కలుగునునీఇంటన్నా
సంతోషాలు హరివిల్లై నీచెంతన్నా
ఏడుకొండలవాడు ఇక వెనువెంటేనన్నా
దేవుడు ఉన్నడాలేడానన్న సందేహము వలదన్న
నీయందె ఉన్నాడు... నీలోనే దాగియున్నాడు....
కొలవరా ఒరన్నా నమ్మరా నరుడన్నా
హరిహరియంటూ హరినామం తలవరా ఒరన్నా
-----------------------------------------------

No comments:

Post a Comment