Sunday, December 14, 2014

కడలికి ఎన్నో నదులతో బంధము
మనిషికి ఎన్నో జన్మలతొ సంబంధము
మాధవునికి ఎన్నో మనసులతో బంధము
లోకేశ్వరునికి ఎన్నో లోకాలతో సంబంధము
దైవానికి దాసునికి విడదీయ్యరాని బంధము
సర్వేశ్వరునికి సకలానికి చిరకాల సంబంధము
ప్రకృతికె ప్రాణం పోసి పరమానందమే కల్పించి
వికృతినై విపత్తు కలిగించి విలవిలలాడించి
సృష్టికి,అసృష్టికి తానేమూలమునై
తనలోతానే ఇక్యమునైయ్యే
లీలలు సర్వాంతరయామికి
కాలచక్రానికి సృష్టిసంబంధము

No comments:

Post a Comment