కీర్తన 44E
------------
పలుకవే ప్రియురాల నిలువవే జవరాల
మనసు పొంగి, ప్రేమ పొంగి పొరలిందే
నడక మారిందే, నీ వైపు మళ్లిందే
మనసు పొంగి, ప్రేమ పొంగి పొరలిందే
నడక మారిందే, నీ వైపు మళ్లిందే
చెప్పకోయి చెలికాడా, చేరరాక చెలికాడా
చిన్నదాని మనసు నెఱిగి మసులు కోక
మాటలేలోయ్ ఇక మౌనమే ముద్దొయీ
చిన్నదాని మనసు నెఱిగి మసులు కోక
మాటలేలోయ్ ఇక మౌనమే ముద్దొయీ
రాణులు ఎందరున్నా రాధకై రైరైని వచ్చినానే
యదుకులము నొదలి నీఎదలో కొలువైనానే
గోపురము కాదని నీ ఒడిలో వాలినానే
యదుకులము నొదలి నీఎదలో కొలువైనానే
గోపురము కాదని నీ ఒడిలో వాలినానే
చాలు చాలించు నీ బడాయి చెంతకు రాకోయి
చేసిన బాసలన్ని ఏమైనాయి ననుమోసగించద్దోయీ
తూర్పు తెల తెల వారాబోతోంది వెళ్ళి రావోయి
చేసిన బాసలన్ని ఏమైనాయి ననుమోసగించద్దోయీ
తూర్పు తెల తెల వారాబోతోంది వెళ్ళి రావోయి
No comments:
Post a Comment