Sunday, December 14, 2014

కీర్తన 44F
------------
అందారాని ఆరాధ్యదైవానికై ఆరాటం
పొందలేని పరమాత్మునికై పోరాటం
కానరాని కలియుగదైవానికై కోలాటం
భక్తిభావంతో భగవంతునికై ఉబలాటం
అందే మానవఆరాటం జీవనపోరాటం
ఇందే మనసుఉబలాటం మదికోలాటం
కానీ మనజీవితాలతో దేవుని చెలగాటం
ఐనా మాధవునికై మనకు మొహమాటం
ఎన్నాళ్ళొ ఎన్నెళ్ళో ఈబతుకు పితలాటం
తీరంతెలియని కెరటాల ఆరాటం పోరాటం
సాధ్యంకాని చేరలేని శ్రీసన్నిదికై ఉబలాటం
ప్రశ్నార్ధక మైన చిన్నిజీవంతో చెలగాటం
దయుంచి మము పాలింపరా దీనబాంధవా!!!!!!

No comments:

Post a Comment