Sunday, December 14, 2014

కీర్తన 44I
------------
ఝుమ్మాఝుమ్మ నా మనసే లాగిందమ్మా
గుమ్మా గుమ్మ గోపాలుడు గావలందమ్మా
కలలోకి వచ్చాడమ్మా కలవరమే కల్గించాడమ్మా
చెంతన చేరాడమ్మా గిలిగింతలు పెట్టాడమ్మా
సన్నజాజీ నడుము సపెంగా సరము నంటూ
నడుముకు వడ్డాణమునై చుట్టుకొన్నాడమ్మా
తామరాకుపై నీటి బిందువులా నామేనుపై
జరజర జారాడమ్మా జాతర జెసాడమ్మా
చిన్నిచిన్ని కన్నయ్య సిగ్గు సిగ్గు నంటూ
సరసాలలో సరిగమ లన్నీ నేర్పాడమ్మా
హరే కృష్ణా హరే కృష్ణా ఆగారా కృష్ణా ఆగు
అనేలోపే అందాలన్నీ విందులు చేసాడమ్మా
కను మూసి తెరిచే లోపలే కన్నయ్యా
మెరుపల్లే మెరిసి మాయమైనాడమ్మా !!!!!
ఝుమ్మాఝుమ్మ నా మనసే లాగిందమ్మా
గుమ్మా గుమ్మ గోపాలుడు గావలందమ్మా........

No comments:

Post a Comment