కీర్తన 44G
------------
కదలను వదలను కానరాక స్వామి నేడుకుదరదు జరగదు కరుణించక స్వామి నేడు
పురుషులందు పుణ్యపురుషుడని పొగడితిని
సకాలలోకాలకు సర్వేశ్వరుడని సేవించితిని
సకాలలోకాలకు సర్వేశ్వరుడని సేవించితిని
పాటపాడుచున్నానని ఆటఆడుచు ఆదమరువకు
తేటతెల్లముగా లేవని తామాసము చేయకు స్వామి
తేటతెల్లముగా లేవని తామాసము చేయకు స్వామి
పట్టిన కాళ్ళు విడవను, బిగువను సడలను నేడు
పంతమేల నీకై పరీతపించేవానితో పురుషోత్తమా
పంతమేల నీకై పరీతపించేవానితో పురుషోత్తమా
దయతో దాసుడను మన్నించి దర్శనమియ్యగారావా
తనివితీరా తిరుమలేశుని తిలకించి పరవశించిపోనీవా !!!
తనివితీరా తిరుమలేశుని తిలకించి పరవశించిపోనీవా !!!
No comments:
Post a Comment