కీర్తన 237
-----------
సుముఖమొ విముఖమొ నాకేల ఎరుగనయ్యాఅఖిల సామ్రాజ్య పాల నిఖిల నీరాజన రూపా
కీర్తించువాడనో కళంకంతెచ్చువాడనో నని
సందేహమేల నయ్యా సకల కళా వల్లభా
సందేహమేల నయ్యా సకల కళా వల్లభా
సుజన సువర్ణవర్ణచరిత్ర పవిత్రరఘువంశ పుత్ర
త్యాగరాజ సంకీర్తనామృత గాత్ర పవనజ స్తుతి చిత్ర
వాల్మీకి రమణీయ్య కావ్య కథానాయకా
త్యాగరాజ సంకీర్తనామృత గాత్ర పవనజ స్తుతి చిత్ర
వాల్మీకి రమణీయ్య కావ్య కథానాయకా
ఎవరి తరమౌను నిను కీర్తించ
ఎవరి వశమౌను నిను నిందించ
నిను మెప్పించ నొప్పించ దలచిన మా భ్రాంతికాక
ఎవరి వశమౌను నిను నిందించ
నిను మెప్పించ నొప్పించ దలచిన మా భ్రాంతికాక
సోమసూర్యలోచనా రాగ సుధారస పావనా
సుముఖమని చెప్పవయ్యా మాయను మెప్పించుటకు
సుముఖమని చెప్పవయ్యా మాయను మెప్పించుటకు
No comments:
Post a Comment