-----------
చాలు చాలునయ్యా నీ చెణుకులు
వలదు వలదునయ్యా నీ ఒలకలు
చూపిన లీలలు చేసిన మాయలు
ఒట్టేసిన బాసలు కృష్ణయ్యా కోకల్లలు ||చాలు చాలు||

కుండకుండకు ఓరాయి
కొమ్మకొమ్మకొ సన్నాయి
గూటిగూటికొ గువ్వనెలోయి
రేయిరేయికి ఓరవళినేలోయి ||చాలు చాలు||
తేనెలోలుకు మాటలతో కవ్వించకోయి
వాలువాలు చూపులతో ఊరించకోయి
గిలిగింతల మురళి గానంతో మనసు దోయకోయి
నిగనిగలాడే మేనిసొగసులతో నావడి చేరకోయి ||చాలు చాలు||
వన్నెల చిన్నెల వలపుల తలపుల
నందనందనా వగలు మాని వెళ్ళవోయి ||చాలు చాలు||
No comments:
Post a Comment