Sunday, December 14, 2014

కీర్తన 44S
------------
గుడెసె గుడెసె గుడిగా తలచి
దీనులకై దేవుడిలా దిగివస్తావో
చీకటి బ్రతుకుల విముక్తికై
సూర్యుడిలా ఉదయిస్తావో
పేదోళ్ల జీవితంలో పండు
వెన్నెలై పండగ తెచ్చేవో
ఏల వస్తావో స్వామీ .....
ఎన్నడోస్తావో స్వామీ .....
రాముడిలా నడచొస్తావో
కృష్ణుడిలా ప్రెమిస్తావో
గుడిసేలోన గుభాళించే భక్తియున్నది
గుడికన్నా ఎంతో పదిలమన్నది
చీకటిలో సేవచేసే దాసియున్నది
చరణారవిన్దాలకు దాసోహామన్నది
పేదవాడి ప్రసాదములో ప్రేమయున్నది
పరమాత్మా నాయాత్మ నీవేనన్నది
నీ రాకకై ఎదురు చూచుచున్నది
దేవా దీనబాంధవ దయచూపమన్నది

No comments:

Post a Comment