కీర్తన 44Y
------------
నిగనిగలాడే నీ మేని అందంమిలమిలలాడే నా మససుకే సొంతం
కళకళలాడే నీ కలువుల నయనం
కిలకిలలాడే నా గానానికే బంధం
సిగసిగలాడే నీచలువరాతి సౌందర్యం
ఘుమఘుమలాడే నావలపుకే చందనం
గలగలలాడే నీ గాజుల గానం తానం
ఘల్లుఘల్లుననాడే నా అందెలకే సంగీతం
పెటపెటలాడే నీపూలపైట ప్రణయం
రెపరెపలాడే నావయసుకే పరిణయం .
రావే రాధా నాధునికై, రాగానికే అనురాగమై
ప్రాణానికే ప్రాణమై, బంధానికే అనుబంధమై
నాలో సగమై రాధమాధవుడనై నిలిచిపోనీవే....
No comments:
Post a Comment