కీర్తన 39
-----------
ఓ....గోవులురా, ఓ... గోపికలారా
ఏడే గోపాలుడు ... ఏడేడే గోవిందుడు
-----------
ఓ....గోవులురా, ఓ... గోపికలారా
ఏడే గోపాలుడు ... ఏడేడే గోవిందుడు
గోవుల కాచే గోకుల గోపబాలకులారా
గున్నమావి కొమ్మమీద గువ్వలారా
ఏడే గోవర్ధనగిరిధారుడు,ఏడేడే గోవిందుడు
గున్నమావి కొమ్మమీద గువ్వలారా
ఏడే గోవర్ధనగిరిధారుడు,ఏడేడే గోవిందుడు
యమునమ్మ వయసు ఎగిరెగిరి పడుతుంది
వెన్నెలమ్మ వలపు పురివిప్పి ఆడుతుంది
రాధమ్మ మనసు తుళ్ళితుళ్ళి పడుతుంది
వెన్నెలమ్మ వలపు పురివిప్పి ఆడుతుంది
రాధమ్మ మనసు తుళ్ళితుళ్ళి పడుతుంది
ఏడే..యదువంశబాలుడు, ఏడేడే యశోదాకృష్ణుడు
రాడే..రేపల్లెగోపాలుడు, రానేరాడే..రాగాలలోలుడు
ఆడే..ఆనందకృష్ణుడు, ఆటలాడే అందాలమోహనుడు
రాడే..రేపల్లెగోపాలుడు, రానేరాడే..రాగాలలోలుడు
ఆడే..ఆనందకృష్ణుడు, ఆటలాడే అందాలమోహనుడు
ఏడే గోపాలుడు ... ఏడేడే గోవిందుడు....
ఏడే గోవర్ధనగిరిధారుడు..ఏడేడే గోవిందుడు...
ఓ..గోవులురా, ఓ గువ్వలారా..ఓ. గోపికలారా...
ఏడే గోవర్ధనగిరిధారుడు..ఏడేడే గోవిందుడు...
ఓ..గోవులురా, ఓ గువ్వలారా..ఓ. గోపికలారా...
No comments:
Post a Comment