కీర్తన 38
-----------
కృష్ణా!మనసే కోవెల చేసితిని
కోవెలలో కృష్ణుని నిలిపితిని
-----------
కృష్ణా!మనసే కోవెల చేసితిని
కోవెలలో కృష్ణుని నిలిపితిని
కమ్మని శిలగా మలచితిని
కోయిలమ్మ నై కమ్మగా పిలిచితిని
కోయిలమ్మ నై కమ్మగా పిలిచితిని
నీపదములు రేణునై రాలితిని
నీపెదవులన వేణువై వాలితిని
నీపెదవులన వేణువై వాలితిని
నాలోకము నీవేనని తలచితిని
నీశ్లోకములో ననునేను మరచితిని
నీశ్లోకములో ననునేను మరచితిని
No comments:
Post a Comment