Sunday, December 14, 2014

కీర్తన 46
----------
వందనం వందనం వెంకటేసా
నందనం నందనం నీ వదనం వెంకటేసా....
సుందరం సుందరం చిద్విలాసా
సుమదరం సుమదరం నీ దరహాసం శ్రీనివాసా.....
అభివందనం అభివందనం ఆనందవాసా
అభినందనం అభినందనం నీ ఆత్మీయ్యబంధం ఆలిమెలవాసా....
నీ సంకీర్తనం సంతోషమయం నీ వేడుక వేదాంతమయం
నీ దర్శనం అనుభూతిమయం నీ బంధం పూర్వజన్మసుకృతం
ఏమిచ్చి నీరుణము తీర్చుకోగలను
ఎన్నిజన్మలెత్తి నీరుణము బాపుకోగలను
ఏడుకొండల వాసా... ఓ వేంకటేసా....
సప్తగిరుల వాసా ... ఓ చిద్విలాసా ....
-------------------------------------------


No comments:

Post a Comment