కీర్తన 44P
------------
అందని జాబిలి అనుకొన్నా నొకనాడు ఆనాడుఅందరి బంధువు అని తెలుసుకొన్నా ఈనాడు
కనరాని దేవుని కనులా జూడాలనుకొన్నా ఆనాడు
కనులేదుటే ఉంటాడని తెలుసుకొన్నా ఈనాడు
కనులేదుటే ఉంటాడని తెలుసుకొన్నా ఈనాడు
కడలిలో అలలపై శయనించినున్నావనుకొన్నా ఆనాడు
కొండలలో కొలువైయున్నావని తెలుసుకొన్నా ఈనాడు
కొండలలో కొలువైయున్నావని తెలుసుకొన్నా ఈనాడు
దివిలొ యున్న పారిజాతము ననుకొన్నా ఆనాడు
ధరణిలో నడయాడిన దేవుడవని తెలుసుకొన్నా ఈనాడు
ధరణిలో నడయాడిన దేవుడవని తెలుసుకొన్నా ఈనాడు
ఎక్కడ ఉన్నాడు ఎలా ఉంటాడు ననుకొన్నా ఆనాడు
ఏడుకొండలపై వెలాసిఉన్నావని తెలుసుకొన్నా ఈనాడు
ఏడుకొండలపై వెలాసిఉన్నావని తెలుసుకొన్నా ఈనాడు
No comments:
Post a Comment