కీర్తన 41
-----------
కుశలమా కుశలమా కౌసల్యరామా
కారడవుల కేగిన కైకేయిరామా
-----------
కుశలమా కుశలమా కౌసల్యరామా
కారడవుల కేగిన కైకేయిరామా
కారణజన్ముడవు కమనీయ హృదయుడవు
కఠిననిర్ణయమున కారడవికేగితివి
తండ్రిమాట జవదాటని తనయుడవు
తరతరాల తార తారకరామ ||కుశలమా||
కఠిననిర్ణయమున కారడవికేగితివి
తండ్రిమాట జవదాటని తనయుడవు
తరతరాల తార తారకరామ ||కుశలమా||
ఏకందమూలాలను స్వీకరించితివో
ఏలకఠిననేలపై పవ్వళించితివో
ఏముల్లు నాటునో ఆచరణారవిందాలకు
ఏల పర్ణశాలలో జీవిన్తువొ జానకిరామా ||కుశలమా||
ఏలకఠిననేలపై పవ్వళించితివో
ఏముల్లు నాటునో ఆచరణారవిందాలకు
ఏల పర్ణశాలలో జీవిన్తువొ జానకిరామా ||కుశలమా||
చేయని నేరమునకింత కఠిన శిక్ష
సేవలు సేనలు కరువాయెనేలరా
రావణుని కూల్చెడి రహస్యమ్మిదియేన
రామబంటుని బ్రోచు మార్గమిదియేనా రఘురామా
సేవలు సేనలు కరువాయెనేలరా
రావణుని కూల్చెడి రహస్యమ్మిదియేన
రామబంటుని బ్రోచు మార్గమిదియేనా రఘురామా
కుశలమా కుశలమా కౌసల్యరామా
కారడవుల కేగిన కైకేయిరామా
కారడవుల కేగిన కైకేయిరామా
No comments:
Post a Comment