కీర్తన 44B
------------
కాటుక కన్నులకు కలవరమాగాజుల కరములకు కలకలమా
అందెల రవళులు ఆపతరమా
నినుమదిలో దాచుట నాతరమా
నినుమదిలో దాచుట నాతరమా
రవికకు బిగువలు కొంగుకు పొంగులు
బుగ్గకు సిగ్గులు మనసున మొగ్గలు
బుగ్గకు సిగ్గులు మనసున మొగ్గలు
ఎదపై నగనగము, ఎదలో నీరూపము
ఎన్నడు ఎరుగని మాయామనఆనందము
ఎన్నడు ఎరుగని మాయామనఆనందము
నీతో బంధం భవబంధం నా తరమా
కృష్ణా! నీ గానము వదనము నా సొంతమా ...
కృష్ణా! నీ గానము వదనము నా సొంతమా ...
No comments:
Post a Comment