Sunday, December 14, 2014

కీర్తన 44C
------------
సిరిచెంత సిగ్గెలరా శ్రీనివాస
చిత్తగించి చెలిమికి రమ్మనక
కలువను కౌగిలిలో బిగించక
వలపులకు తలపులు అద్డక ||సిరిచెంత||
సిగ్గుతో సల్లంగా కనుసైగ చేసే
కెంపుపెదాలకు ఇంపునవ్వురాసే
వగలు ఒలకబోసి,వయ్యారం విరబొసి
వేసింది నీమనసుకు కన్నేగాలం ||సిరిచెంత||
హోయలు ఒలికించి లయలు చిలికించి
విసిరింది మల్లెల వాలు జడ
చనువుతో సింగారాలు చూపవయ్యా
రమణితొ రతుల చెలరేగవాయ్యా !!సిరిచెంత||

No comments:

Post a Comment