Sunday, December 14, 2014

కీర్తన 44K
------------
ఆగకు ఆగకు ఇక ఆలస్యమెందులకు
పదపద ముందుకు పావనకొండలకు
వెంకటరమణుడు వెలసిన ఏడుకొండలకు
అడగకనే ఆప్యాయతతో అభయమునిచ్చి
ఆదరించి అక్కునచేర్చుకొని ఆపదలెల్లతీర్చి
కరుణించి కొండంత అండనై కాపాడు కొండలకు ||ఆగకు ..||
దర్శించికొని దండమెట్టిన దయగొల్పుదేవుడు
తలవగనే తీరనికష్టాలెల్ల తీర్చేటితిరుమలనాధుడు
తేనేటి వరాలుగుప్పించు తిరుమలేసుడుండే కొండలకు ||ఆగకు ..||
వెంకటరమణుడు వెలసిన వెన్నెలవెండికొండలకు
తిరువెంకటాధీశుడు నేలేటి తిరుమలకొండలకు
పురుషోత్తముడుకు పురుడుపోసిన పావనకొండలకు ||ఆగకు ..||

No comments:

Post a Comment