Wednesday, December 24, 2014

కీర్తన 178
-----
మరువలేక మరచిపోలేక మనసు మార్చుకోలేక 
వీడలేక విడిచిపోలేక బంధము బాపుకోలేక 

ప్రేమ కురిపించి మనసు మురిపించే మేఘమే రాక
చేయి అందించి బంధము బతికించే నాధుడే లేక 

ఎన్నాళ్ళొ ఎన్నేళ్ళో ఈ ఒంటరి పయనం ఎరుగక  
తోడు రాని నీడ లేని మొడుబారిన మొవినై ....
మనసు ఛంపుకొని మమతను మాపుకోలేక  

తుంటరి కృష్ణయ్య రాకకై కనులు వేచిచూడలేక
తలుపులు మూయలేక వలపులు ఆపుకోలేక 

వెన్నెలకాచిన వృందావనిలో మల్లెలుపూచిన మధురావనిలొ 
వేయి చూపులతో వేచియున్నాను రారా కృష్ణా రారా కృష్ణా రారా 

Monday, December 22, 2014

కీర్తన 177
-----------
చాలు చాలునయ్యా నీ చెణుకులు 
వలదు వలదునయ్యా నీ ఒలకలు 

చూపిన లీలలు చేసిన మాయలు 
ఒట్టేసిన బాసలు కృష్ణయ్యా కోకల్లలు ||చాలు చాలు||

కుండకుండకు ఓరాయి   
కొమ్మకొమ్మకొ సన్నాయి
గూటిగూటికొ గువ్వనెలోయి  
రేయిరేయికి ఓరవళినేలోయి  ||చాలు చాలు||

తేనెలోలుకు మాటలతో కవ్వించకోయి 
వాలువాలు చూపులతో ఊరించకోయి 
గిలిగింతల మురళి గానంతో మనసు దోయకోయి  
నిగనిగలాడే మేనిసొగసులతో నావడి చేరకోయి ||చాలు చాలు||

వన్నెల చిన్నెల వలపుల తలపుల 
నందనందనా వగలు మాని వెళ్ళవోయి  ||చాలు చాలు||



కీర్తన 176
-----------
వేడుకోరా మామా వేడుకోరా మామా
వడిపట్టవె భామా వడిపట్టవె భామా 

కరములు జోడించి వేడుకోరా మామా
వడి నిండుగా గుప్పించు వరములు భామా 
ఇంటి నిండుగా దొర్లించు సిరులు భామా 
కడుపు పండించు కానుకలు ఇచ్చు భామా

తప్పులు మన్నించు తీపులు రుచిచూపించు 
ఆపదలు తొలగించు సౌభాగ్యము కలిగించు
భవములు మాన్పించు పుణ్యము ప్రసాదించు 
దారి మళ్లించు ముక్తి మార్గము చూపించు

వెళదాము రా ఏడుకొండలకు మామా
ఏడుకొండలవాడిని వేడుకొందాము రా మామా 
వెతలు బాపి వడి పండించు వరాలు వడ్డించు మామా 
వెన్నల కాంచు దేవుడు వేంకటగిరి వైకుంఠ నాధుడు ..

Saturday, December 20, 2014

కీర్తన 175
-----------
ఎవరికి ఈ వీడుకోలు ఎందుకు ఆ వేడుకోలు
ఎవరికై కన్నీటిభాష్పాలు ఎందుకీ హృదయవిచారవేదనలు

పుడమిన విత్తు మొలకై చిగురించి
పెరిగి పెరిగి ప్రాయాన చెట్టునై చాచి
పువ్వై పూచి కాయై కాచి పండై రాలి
తిరిగి పుడమిని చేరిన విత్తుకా వీడుకోలు || ఎవరికి||

గగనాన నీలి మేఘము విహంగమై విహరించి
చిరుగాలికి పులకించి వానై నీటిని చిలుకరించి
భువిని చేరి వరదై ఉప్పొంగి వాగువంకై ఉరికి
నదియై నడచి నడచి కడకు కడలిని చేరి
అవిరై తిరిగి గగనానికి ఎగసిన మేఘానికా వీడుకోలు || ఎవరికి||

గోకులానా గోధూళి నై రాలి కడుపు పండించి
పురిటిన జీవం పోసుకొని పుడమిన జన్మించి
నలుగురితో నవబంధాలు పెనవేసుకొని పరవశించి
బాల్య యవ్వన కౌమారదశ దాటి ముదసిలినై
మరల తిరిగి జగన్నాధుని చేరిన జీవానికా వీడుకోలు || ఎవరికి||

కాలచక్రములో సూర్యచంద్రుల తిరోగమనములా తిరుగాడే
జననమరణ జగన్నాటకములో జీవానికి ఎంధుకు వీడుకోలు ... హరీ....

కీర్తన 174
-----------
వాసా శ్రీనివాసా ఈశా వెంకటేశా
శరణు శరణు శ్రీ చిద్విలాసా
నీ చరణాలే నాకు శరణ్యం శ్రీనివాసా

సుడి గుండములో చిక్కుకొంటిని
చేయి చాచినా సాయము చేయువారులేరు
అభయమిచ్చి ఆదుకోరా ఆలిమెలవాసా

కాలంతో కలసి కన్నీరు వరదై కబలించబోతుందే
అందించవా నీ చేయి స్పందించవా ఈ రేయి
వేగా రావా బేగ రావా ఈశా పరమెశా వెంకటేశా

నమ్మినదైవం నమ్మకంగా పలికేవని ఋజువుచేయగరావా
కొలచిన దైవం కన్నమనసై కంటికిరెప్పలా కాపాడుతాడని
చూపగ రావా శరణాలవాలా శ్రీనివాసా వాసా శ్రీ చిద్విలాసా

కడసారి చూపుకైనా రావా కదలి రావా
కాన రావా కరుణాలవాలా కలియుగ దేవా
బేగ వేగ రావా ఈశా పరమెశా వెంకటేశా

కీర్తన 173
----------
వాసా శ్రీనివాసా ఈశా వెంకటేశా
శరణు శరణు శ్రీ చిద్విలాసా
నీ చరణాలే నాకు శరణ్యం శ్రీనివాసా

సుడి గుండములో చిక్కుకొంటిని
చేయి చాచినా సాయము చేయువారులేరు
అభయమిచ్చి ఆదుకోరా ఆలిమెలవాసా

కాలంతో కలసి కన్నీరు వరదై కబలించబోతుందే
అందించవా నీ చేయి స్పందించవా ఈ రేయి
వేగా రావా బేగ రావా ఈశా పరమెశా వెంకటేశా

నమ్మినదైవం నమ్మకంగా పలికేవని ఋజువుచేయగరావా
కొలచిన దైవం కన్నమనసై కంటికిరెప్పలా కాపాడుతాడని
చూపగ రావా శరణాలవాలా శ్రీనివాసా వాసా శ్రీ చిద్విలాసా

కడసారి చూపుకైనా రావా కదలి రావా
కాన రావా కరుణాలవాలా కలియుగ దేవా
బేగ వేగ రావా ఈశా పరమెశా వెంకటేశా
కీర్తన 172
-----------
నిను నమ్మివస్తున్నా
నీ చెంతకు వస్తున్నా

కరుణిస్తావో వరమిస్తావో...
అది నీకే వదిలేస్తున్నా...

పట్టు సడలి గట్టు జారి పోతున్నా
కట్టు నొదలి నెట్టు కొని వస్తున్నా
లాలిస్తావో పాలిస్తావో అది నీకే వదిలేస్తున్నా...

అన్నపానీయాలు మాని వగుడౌతున్నా
కాలం కాటెస్తున్నా మరణం మాటెస్తున్నా

దీక్ష మానక నిన్ను మరవక దారి మళ్లక
మెట్టు మెట్టుకు ప్రాకి ప్రాకి కొండ కొస్తున్నా
కనిపిస్తావో నీలొ కలిపేస్తావొ అది నీకే వదిలేస్తున్నా...
కీర్తన 171
---------
రామ నామానికి రామ రూపానికి ప్రణమిల్లినాడు
రామునికి అండగా నిలిచి రాముని బంటైనాడు

రామునికి తోడునీడైనాడు కడలిపై లంఘించినాడు
అంగుళీకము అందించి అశోకవానాన్ని అల్లాడించినాడు

రాముని దూతనై రావణునికి కంఠకమైనాడు
ధర్మము పాటించని దశకన్ఠునిలంక దహించినాడు

గగనానికీ ఎగసి సంజీవీకై హిమగిరులు పెళ్ళగిన్చి
వాయువేగాన వెనుతిరిగి వీనువీధిలో పయనించి
సూర్యుని చేదించి లక్ష్మణుడును బ్రతికించినాడు

రాముణ్ణిభుజానమోసి , హృదయమున బంధించి
రామనామము జపీంచి తపించి పూజించి
రాముని తరువాయి రాముడంతటి దేవుడైనాడు

Sunday, December 14, 2014

కీర్తన 170
------------
దీపం లేని వెలుగే దైవం
స్వార్ధం లేని సేవే స్వర్గం
మనిషి లోని మంచే మోక్షం
మనసు లోని మెరుపే దైవం
హృది లోని ప్రాణమే దైవం
కష్టం లోని సుఖమే దైవం
మేఘం లేని వరమే దైవం
బంధం లేని అనుబంధమే దైవం
నీలో నాలో ఉన్నది దైవం
నీకు నాకు గమ్యమే దైవం
నిన్ను నన్ను కాచేదే దైవం
నీవు నేను ప్రార్ధించేది దైవం
ధర్మాన్ని కాపాడేది దైవం
ధరిత్రిని రక్షించేది దైవం
పాపాన్ని బాపేది దైవం
పుణ్యం నిచ్చేది దైవం


కీర్తన 169
------------
నడవలేనయ్యా స్వామి విడువలేనయ్యా
నడవలేనయ్యా స్వామి విడువలేనయ్యా
నను బ్రోవరావయ్యా స్వామి నారాయణా.....
కొలచి కొలచి కరములు వాలిపోయే
పాడి పాడి పెదవులు వాడిపోయే
నడచి నడచి అడుగులు అలిసిపోయే
జవసత్వాలు నింపుకోలేక ఆగిపోయే
ఏడేడుకొండలు ఎక్కిరాలేక
చేసిన బాసలు నిలిపుకోలేక
తీరము చేరలేక తిరుగు వెళ్ళలేక
ప్రాణాలు విడువలేక ప్రార్ధిన్చితినయ్యా
నమో వెంకటేశాయ నమో శ్రీనివాసాయ
నను బ్రోవ వేగ రావయ్యా నారాయణా....
నావేదన తీర్చగ రావయ్యా నారాయణా....
నీవేడుక చూపగ రావయ్యా నారాయణా...


కీర్తన 168
------------
ఏలాలో ఏలాలో ఏడుకొండలసామికి ఏలాలో
వోలాలో వోలాలో వేంకటేసునికి వోలాలో
వరాల వరదుడకు వోలాలో వోలాలో
సిరుల సక్కనోడుకు ఏలాలో ఏలాలో
నీడైన నల్లనయ్యకు ఏలాలో ఏలాలో
తోడైన తిరుమలయ్యకు వోలాలో వోలాలో
ఏలాలో ఏలాలో ఏలాలో ఏలాలో
వోలాలో వోలాలో వోలాలో వోలాలో
కట్టాల్లో సగమైయ్యే సామికి ఏలాలో ఏలాలో
నట్టాల్లో నాదుకొనే నాసామికి వోలాలో వోలాలో
పాపాలు బాపే బాపనయ్యకు ఏలాలో ఏలాలో
శాపాలు మాపే సీనయ్యకు వోలాలో వోలాలో
ఏలాలో ఏలాలో ఏలాలో ఏలాలో
వోలాలో వోలాలో వోలాలో వోలాలో
కీర్తన 167
-----
ఏడ కొనేది మల్లి ఏడ కొనేది
ఏమని వెళ్లేదే మల్లి ఏమని వెళ్లేదే
చేతిలోన చిల్లిగవ్వ లేకపోయేనే
జాము చూస్తే సందెనాయే
పొద్దు చూస్తే వాలిపోయే
సంత చూస్తే మూసినాయేనే
ఒట్టిచేతులతో వెళ్ళదామంటే
కృష్ణయ్య కనులు వెదుకునేమో
కన్నయ్య మనసు కటకటలాడునేమో
నల్లనయ్య ముఖము వాడిపోవునేమో
ఎమి చేద్దామే మల్లి ఎట్టా వెళ్ళదమె
మహారాజులకు మనమేమి ఇద్దమే
ఈపిడికిలి అటుకులు పట్టుకెళ్లదామే
పేదవాడి ప్రసాదము స్వీకరించమని
ప్రేమగా పరమాత్ముని ప్రాధేయపడదమె
వెన్నలాంటి వాసుదేవుడు కరుగుతాడు
మల్లెలాంటి మాధవుడు హత్తుకొంటాడు
కీర్తన 166
-----
కానరాని నీడవు నీవయ్యా
వీడరాని తోడువు నీవయ్యా
మరువరాని ప్రేమ నీవయ్యా
మమతలు పంచే మాధవుడవు
మనసున నిండిన మహారాజువు
రామరామయ్యా రఘురామరామయ్యా
రామరామయ్యా సీతారామరామయ్యా
స్తంభములో సింహము నీవయ్యా
సరస్సులో చక్రం నీవయ్యా
కడలిలో కూర్మము నీవయ్యా
కొలనులో కమలము నీవయ్యా
వేదాలకు వరాహము నీవయ్యా
విశ్వానికి ఓంకారము నీవయ్యా
దివిలో దేవుడు నీవయ్యా
భువిలో బుధ్ధుడు నీవయ్యా
ప్రకృతికే తుమ్మెద నీవయ్యా
మేఘానికే మెరుపు నీవయ్యా
ఆకాశాన విరిసిన హరివిల్లువు నీవయ్యా
ఏడుకొండలలో వెలసిన వేంకటేశుడు నీవయ్యా



కీర్తన 165
-----
నడిరేయిన నాస్వామి నడయాడి
నళినిని చేరి నగవులు చిందించి

నలిమేల వడిలో నవమోహనాంగుడై
నవరస శృంగారకేళీ నాట్యమాడు వేళ

వెండి వెన్నెల పరిచినట్లు
వేయి కలువలు విచ్చినట్లు

కొండ గాలి విసిరినట్లు
కన్నె కొంగు ముసిరినట్లు

కొండలు కళకళ లాడే
కొలను గలగల లాడే

కోయిల కిలకిల లాడే
గువ్వలు గుసగుస లాడే

సన్నజాజి మొగ్గలు సరసాలాడే
సంపెంగ పూలు సింధూరమాయె
చందమామ మబ్బు చాటు దాగే

జామురాతిరి జాబిలమ్మ జోలపాడే
తెల్లారినా కోడి కూయక నిద్దురోయే
తిరుమలేశునికి సుప్రభాత వేళాయె
చూచి చెలికత్తెలు పకపక నవ్వులాయె
కీర్తన 164
-----
దాని మనసే మందారం మాటే మకరందం
దాని వలపే వయ్యారం చూపే సింగారం
వయ్యారి నడుములో ఎన్నెన్ని వంపులో
హొయల వంపులో ఎన్నెన్ని సొగసులో
సొంపుల సొగసులకు నిదురాని ఎన్నెన్ని రాతిరిలో
ఎద పరువాలు పాలపొంగులై పొంగుతుంటే
ప్రేమ బాణాలై ఎదలోతుల్లో గుచ్చుతుంటే
ఆశె విహంగమై వినీలాకాశంలో ఎగురుతుంటే
గోవి మూగబోయే గుండె ఆగిపోయే
చూపు మరలక ప్రాణం సలుపుతున్దె
రావేరావె చందమామ అలరించవే ఓ భామా
ఆగలేను అడగలేను ఓపలేను ఓర్చుకోలేను
మదనుని మన్నించవే మురళిని మోగించవే
రావేరావె చందమామ అలరించవే ఓ భామా

కీర్తన 163
-----
చిన్నచిన్న సేవలు చేశాను శీనయ్యా
చీకుచింతలు లేవాయె నాకు శీనయ్యా

చీకట్లు దూరమాయే బాధలు తగ్గేనాయే
సంతోషాలు చేరువాయె బలము చేకూరేనాయే

మట్టిలో నున్నవాడిని మేఘాలలో తేలితినయ్యా
గుడిసేలో నున్నవాడిని గుడినీకు కడితినయ్యా

గుడినీకు కట్టినానని అద్దాలసౌధము ఇచ్చితివయ్యా
అభయమిచ్చి ఆదుకోంటివి కోరితే కాదనకుంటివయ్యా

అలనాటి రాముడిలా కాక కలియుగ కొండలరాయుడువై
కాసింత సేవకు స్వామీ కొండంత వరములు నొసగితీవయ్యా

ఏమని నీ మహిమాన్విత మహిమలు పొగెడదనయ్యా స్వామి
ఏల నీ మాయాలీలామృుతాలు కవిగట్టనయ్యా స్వామి సీనయ్యా
కీర్తన 162
-----
ఎందరో వస్తారు నాస్వామి నీ కొండకు
ఎందరెందరో వస్తారు నాస్వామి నీ చెంతకు

భక్తులేందరో బారులే తీరేరు నీ కరుణకు
దాసులెందరో భజనలే చేసేరు నీ సేవకు

మహనీయ్యులు మహామహులు మొక్కేరు నీ కృపకు
వేదపండితులు వాగ్గేయకారులు కీర్తించేరు నీ శరణుకు

పడిపడి దండాలు పెడతారు పాపాలు బాపుకొంటారూ
వడ్డీ కాసులు చెల్లిస్తారు వరములు మూటగట్టుకెళతారు

పైసా ఉన్నొళ్ళు లెనొళ్లు పాలకులు పాలిగాళ్ళు ప్రార్ధించేరు
వేషగాళ్ళు మాయగాళ్లు దొరలు దొంగలు దండాలెట్టెరూ

సేవలంటూ నీ చుట్టూ దొంగసాములు చేరి దండుకొనేరు
ముసలోళ్ళు మనసున్నోళ్ళు ముక్తికొరకు పాకులాడేరు

కొండకొచ్చినా వారందరిని చల్లని చూపులతో కరుణించేవు
ఏడుకొండలు ఎక్కిన వారందరికీ వరాలజల్లు కురిపించేవు
కీర్తన 161
-----
రసామృత రాగరజితమే రామా నీ నామము
సుశోభిత నవరత్ననగమే శ్రీరామా నీ సుగుణము

భవసాగరాలు దాటించు నీ భయభవహర నామము
జగతికే ఆదర్శమే నీ సుమశుచిసుగంధ సుగుణము

రమణీయ్య ధామమే నీ నవదివ్యమనోహర రూపము
కమనీయ్య గానమే నీ విజయవీరశోర్యపరాక్రమ చరితము

హృదయంలో పదిలమే నీ సుందరసుగుణ స్వరూపము
తరతరాలకు భవిత్వ్యమే నీ రామాయణ సువర్ణసుచరితము

హనుమ హృదయరంజిత రామా ఆహల్యా శాపవిమోచన రామా
రామా రఘురామ రవికులసోమా రణరంగధీమా శ్రీరామ సీతారామ
కీర్తన 160
-----
కొండ మీద ఏముంది సామి
ఏడుకొండల మీద ఏముంది సామి
కాసులకై కంటిమీద కునుకులేకుండా
నగవులేసీ నడిరేయి దాకా నిలబెడతారు
దొడ్డు దండేందుకు దీవెనెలు ఇమ్మంటారు
ఆయిలేని పప్పుపెట్టి ఆలిలేని పట్టెమంచమేస్తారు
కొండ దిగి రావయ్యా సామి
ఏడుకొండలు దిగి రావయ్యా సామి
కోడికూర వండినాను కల్లుముంత తెచ్చినాను
కమ్మంగా తాగు సామి కడుపునిండా తిను సామి
జరదాకిళ్ళీ వేసి, కమ్మనికథలు ఆలకిస్తూ ఆరుబయట
ఆలిమేల వడిలోవాలి కునుకు తీద్దువుగాని రావయ్యా సామి
మంత్రాలు రాని మోటుభక్తున్నిసామి
పాణానికి పాణమిస్తా రావయ్యా సామి
వరము అడగను కనిపిస్తే సాలు సామి
కన్నప్ప నీకు వేటకూర తేలేదా
కన్నీరు కారిస్తే కన్ను నీకు ఈలేదా
శబరి ఎంగిలి నీకు పెట్టలేదా సామి
నా మాట వినుసామి మా ఇంటికీ రా సామి
తప్పుంటే మన్నించు మోటొడిని సామి
ఏడుకొండల సామి వెంకటేశ సామి....
కీర్తన 159
-----

రానురానంటే రమ్మంటివే
కాదుకాదంటే కానరమ్మంటివే
వేగిర రమ్మంటివే వేడుక చూడమంటివే
వల్లలేదన్నా వడ్డీకాసులను చెల్లించమంటివే
బండెల్లీ పోతున్నాదో సామి రంగా తిరిగెల్లీ పోతున్నాదో
ఊరెల్లీ పోతున్నాదో సామి రంగా ఒట్టిచేత్తో పోతున్నాదో
నా వరమేదిరో వెంకన్నా నీ కరుణేదిరో కిట్టన్నా
ఉన్నదంతా తాకట్టు పెట్టి వచ్చానురో మల్లన్నా
కాసులు అడిగానా నిన్నెమీ పేరులు ఇమ్మన్నానా
ముల్లేమీ అడిగానా మల్లన్నా తీపులేమీ తెమ్మన్నానా
తీరా పోతుంటే తిరకాసు పెట్టకురొ తిరుమలన్నో
సికాకు పెట్టకురో సీనన్నా వల్లేమీ కాదున్నో వెంకన్నా
కానరాకుండా దాగుడు మూతలు ఎందీరో వెంకన్నా
బండెల్లీ పోతున్నాదో సామి రంగా తిరిగెల్లీ పోతున్నాదో
కీర్తన 158
-----

నా నయనం భ్రమించే నా హృదయం చలించే
నా ఉదయం జ్వలించే నీ నామం స్తుతించే
హరీ ..........................................
నిను చూచి చూడగానే నీ పిలుపువిని వినగానే
నీ దరహాసం విరి విరియగానే నీ సన్నిది చేరి చేరగానే
హరీ ..........................................
పరమాత్మునికై పల్లవించినే నా జీవాత్మ భాషా
పరవశంతో పులకించినే నా భక్తిభావ నిషా
హరీ ..........................................
కనులు చాలవే నిను కాంచుటకు
కథలు చాలవే నీలీలలు ఎరుగుటకు
కీర్తనలు చాలవే నిను పొగుడుటకు
హరీ ..........................................
కొండకొనల చిగురించి తరతరాలు భాసించే
విశ్వరూప వదనానికి నా ప్రణామాలు సమర్పించితి
హరీ ..........................................
కీర్తన 157
-----

గగనాన నీవు భువనాన నేను
గోకులాన నీవు భూలోకాన నేను
హరి నామము నిన్ను నన్ను కలుపునా
ఈ దారి దేవుని దరి నను చేర్చునా
వేణువు నాలాపించు చుండగా
శ్రుతిలో నిలువక రేణువునై రాలితిని
కొమ్మను చేరి రెమ్మనై చిగురించి
పుడమిపై పరవశించి పువ్వునై పూచీ
రేయినంతా వేచి రామనామం జపించి
రాగమై తిరిగి నీ వేణుగానమున చేరలేక
తోటమాలిని బ్రతిమాలి తిరుమల చేరి
పరమాత్ముని పాదాల చెంత అమరితిని
కీర్తన 156
-----

పరిచయం లేకున్నా ప్రణయం కాకున్నా
నీవే నా ప్రాణసతుడు ననుకొన్నా
నీ తోడునీడ లేకున్నా నా చెంతకు రాకున్నా
నా ప్రతిబింబములో నీ మనోహర దివ్య శోభిత
మంగళ మన్మధ మాధవ రూపాన్ని సాక్షాత్కరించి చూసుకొన్నా
ఇదే ఈ జన్మకు దొరికిన అందమైన
అద్దములాంటి అనురాగ అపురూప జీవితమని ,
పగిలితే మరలా అతకదని పదే పదే
కనురెప్ప వాల్ఛకుండా చూసుకొంటూ
నా హృదయములో పదిలముగా దాచుకొన్నా ...
ప్రియ సఖినై ప్రణయగీతిక పల్లవించి
మధుమాస శుభవేళ మాధవుని రాకకై వేచి
మరుమల్లెలతొ రాయభారము నంపితిని
మగత లోకి మగువ జారుకోకముందే
కిన్నెరసాని కలల పండగను పండించిపోరా మాధవ.
కీర్తన 155
-----

దేవుడే పోశాడు ఈ ప్రాణము
తిరిగి దేవుడే తీసుకొంటాడు ఆ ప్రాణము
బొమ్మలకు బంధాలు పెనవేసి మురిపిస్తాడు
ఆ బంధాలనే తుంచి విలపించమంటాడు
అన్నీ నీవని ఆశపెడతాడు
ఆటబొమ్మలు చేసి అడుకొంటాడు
చివరకు ఏది నీది కాదంటాడు
జనన మరణాలు తప్పదంటాడు
ఆనందము అనుబంధము అమృుతము
విషాదము విచారము విలయము సృష్టించి
ఏది సత్యమో ఏది ధర్మమో
సర్వము తనకే ఎరుగునంటూ
చివరగా తన చెంతకే చేరమంటాడు
హరీ.... ఏమిటి ఈ చిత్రము
ఎంత విచిత్రము నీ లీలలు నీకే ఎరుక
కీర్తన 154
-----
నల్లానల్లని వాడనని
వెన్న దొంగలించు వాడనని
నన్నన్దరు గేళి చేతురే రాధ
నీలమేఘ శ్యాముడు నీవు
నీలికి వెలుగు నిచ్చు వాడవు నీవు
వెన్న లాంటి మనసున్న వాడవు
వన్నెల మనసులలో దాగిన వాడవు నీవు
గోవులు గాంచు వాడనని
గోపికలను గోల చేయువాడనని
నన్నన్దరు గేళి చేతురే రాధ
గోవర్ధన గిరి నెత్తిన వాడవు
గోకులమును కాపాడిన వాడవు నీవు
గోవి గానము చేయు వాడవు
గీతా బోధన చేసిన వాడవు నీవు
విల్లు పట్టని వాడనని
విద్యలు నెరుగని వాడనని
నన్నన్దరు గేళి చేతురే రాధ
నన్ను ఎవరు వరిన్తురే రాధ
వేదాలు నందించిన వాడవు
విశ్వమునన్తా నావారించిన వాడవు
ఎదలో దాచుకొంటి మనసున నిలిపుకొంటి
ఎవరేమీ ననుకొన్నా నీసతి నేనయ్యా
ఓ మాధవా ఈ రాధ నీదేనయ్యా
కీర్తన 153
-----
సంగతు లెన్నిన్నా
సరసకు రావోయి చెంతకు రావోయి
మామ ఛందమామ చెంతకు రావోయి
జాబిలివై జతజేర రావోయి
మేలి ముసుగు మాటున చాటున
మామ ఛందమామ సంగతులెన్నోనున్నాయి
గుండెల లొగిళ్ళలోన గులాబీలునున్నాయి
తడిమి చూడగా గోవిందుడు కావాలన్నాయి
ఎదలొని సవ్వడులన్ని సెలయేటి సవ్వడులై
స్వాగతం పలికాయి మనమందిరాన నిలువమన్నాయి
మామ ఛందమామ చెంతకు రావోయి
జాబిలివై జతజేర రావోయి

కీర్తన 152
-----
నింగి నడిగా నేల నడిగా
నల్లనయ్య ఏడని చలనయ్య ఏడని
పువ్వులతో లాలించి ప్రేమతో పాలించి
మనసుని దోచి మదిని మలిచి హృదిన నిలిచి
గాలిని స్వరపరచి గోపికలను కలవర పరిచే
గోవులు కాంచే గోపయ్య ఏడని
నవ్వులు పూయించి నగవులు చిందించి
మాటలతో మోహించి చూపులతో బంధించి
సిగ్గులు తొలగించి వలువలు దొంగలించిన
కన్నులు కాంచని కన్నయ్య ఏడని
పువ్వులు నడిగా గువ్వలు నడిగా
నల్లనయ్య ఏడని చలనయ్య ఏడని
రెమ్మలు నడిగా కొమ్మలు నడిగా
గోవులు కాంచే గోపయ్య ఏడని
సూర్యుని నడిగా చంద్రుని నడిగా
కన్నులు కాంచని కన్నయ్య ఏడని
కీర్తన 151
-----
నవ్వకే నవ్వకే నాంచారి
చూడకే చూడకే సుకుమారి
నా మనసు దోచి
నను ముగ్గులోకి లాగకే
వలపుల తలపుల వయ్యారి
సొగసుల సొబగుల సింగారి
అందాల అలివెణి అలకబూనునేమో
చందనాల సుందరి చిరుబురులాడేనేమో
నీ ఆట పాటలతో అలరించకే
అందచందాలతో బంధమేయకే
కీర్తన 150
-----
నీ పూజ మొదలాయె
నా పాట మొదలాయె పరమాత్మ
తెరలు తొలగి తొలగంగనే
భక్తితో నీ పూజ మొదలాయె
ఆర్తితో నా పాట మొదలాయె
ప్రేమతో పువ్వులు ఎన్నో తెచ్చి
శ్రద్దతో పూజలు అన్ని చేసి
భవబంధాలును నొదలి
భక్తిసాగరములో మునిగి
స్వర్గాపురిలో తేలి
శ్రీహరి చరణాల చెంతచేరి
సంకీర్తనలను స్వరపరచెనే పరమాత్మ
శ్వాసనై వేణువులో చేరి
నందుని నాదములో తరంగమై
అలివేణినాధుని అంతరంగమున చేరి
ఆరాధించి ఆలపించి ఆగోపాలుని అలరించెనే
తెరలు తొలగి తొలగంగనే
భక్తితో నీ పూజ మొదలాయె
ఆర్తితో నా పాట మొదలాయె పరమాత్మ
కీర్తన 149
-----
నా చేయి విడువకు రా....
నీ చేయి జారనీకు రా....
సాయము చేయరా దేవా.................
జన్మ జన్మలకు.... ఆజన్మాంతము...
రుణపడి ఉంటాను.... దేవ.. దేవా....
నీ నిజరూపానికి మోకరిల్లి ప్రణమిల్లితీని
నీ పాదపద్మాలలో తలవాల్చితిని.....
ఆర్తనాదముతో ఏకరువుగా ఆర్జించితిని..
నా కన్నీటికెరటము నీపాదతీరాన్ని తాకగ
తక్షణమే అమ్మలా అక్కున చేర్చుకొంటావని
అయ్యల్లా అభయమిచ్చి ఆదుకొంటావని
చేయి చాచి అడుగుతుంటిని....
దాసుడిగా దేవదేవునికి అర్పించుకొంటిని
నన్ను నీవాడననుకోని నారాయణా
నను నీలో ఐక్యము చేసుకోరా.......
ఏడుకొండల వాడా వెంకటరమణ
గోవిందా............... గోవింద....
కీర్తన 148
-----
ఇష్టమో కష్టమో స్వామి
నాకోరిక తీర్చరా స్వామి

సమ్మతమో కాదో, అర్హుడనో కాదో
న్యాయమో ధర్మమో అవునో కాదో
నేనెఱుగ నాకోరిక తీర్చరా స్వామి

సప్తగిరులను చేరి సావసం చేసి
శనివారం నీకై ఉపవాసం చేసి
అక్షర అర్చన పదాలతో పాదసేవ చేసి
సరాగాలతో సంకీర్తనసేవ చేసినాను

కొండకు నను రప్పించుకొంటావో
కరుణతో కొండ దిగి వస్తావో
ప్రత్యక్షమై పరమాత్మా కోరిక తీర్చవా
తిరుమలేసుని నను తిలకించనీవా
https://soundcloud.com/sreenivasuni-sankeertanalu/ishtamoy-rambabu-1

కీర్తన 147
-----
కొండమీద నున్నాడు దేవుడు
కోరినకోర్కెలు తీర్చేటి దేవుడు
కలియుగాన అవతరించిన కొండలరాయుడు
రండో రండి భక్తులారా కొండకు
విచ్చేయండి ఏడేడు కొండలకు
వెతలు బాపుకోని చింతలు మాపుకొనేందుకు
సకలజనులకు సంజీవిని వాడు
ఆపదలలో అమృుతము వాడు
ఆనందాలకు నిలయము వాడు
అన్నియు తానై అందరికి భంధువై
సిరుల వెన్నెల కురిపించు వాడు
వరాల జల్లు దొరలించు వాడు
కొండమీద నున్న దేవుడు
కోరినకోర్కెలు తీర్చేటి దేవుడు
కలియుగాన అవతరించిన కొండలరాయుడు
కీర్తన 147
-----
కొండమీద నున్నాడు దేవుడు
కోరినకోర్కెలు తీర్చేటి దేవుడు
కలియుగాన అవతరించిన కొండలరాయుడు
రండో రండి భక్తులారా కొండకు
విచ్చేయండి ఏడేడు కొండలకు
వెతలు బాపుకోని చింతలు మాపుకొనేందుకు
సకలజనులకు సంజీవిని వాడు
ఆపదలలో అమృుతము వాడు
ఆనందాలకు నిలయము వాడు
అన్నియు తానై అందరికి భంధువై
సిరుల వెన్నెల కురిపించు వాడు
వరాల జల్లు దొరలించు వాడు
కొండమీద నున్న దేవుడు
కోరినకోర్కెలు తీర్చేటి దేవుడు
కలియుగాన అవతరించిన కొండలరాయుడు
కీర్తన 146
-----
వెండి కొండల్లో వెలిసిన వెంకన్నా
ఏడు కొండల్లో వెలుగుతున్న వెంకన్నా
మాటలు కరువాయె మౌనము బరువాయె
చలనము లేని చిరునవ్వుతో చింతనాయె
ఆదరణ లేని అభయముతో భయమునాయె
మనసు మరలినాయె బంధము భ్రాంతినాయె
నీకు నాకు దూరమాయె ఏడుకొండల వెంకన్న
చిన్నమాటతో ఆప్యాయతగా పలకరించరాదా
చిరునవ్వుల జల్లు ఓసారి చిలకరించరాదా
రాయిలో ఉంటానని రప్పలో ఉంటానని
చలనము లేకుండా చూస్తూ ఉంటానంటే
కాలమే వేగమాయెరా కలికాలమాయెరా
గుడినొదలి గుమ్మమేదాటి గుండెల్లో చేరరారా
ప్రత్యక్షమై మము పులకింప చేయరారా
వెండి కొండల్లో వెలిసిన వెంకన్నా
ఏడు కొండల్లో వెలుగుతున్న వెంకన్నా

కీర్తన 145
-----
ఎన్ని ప్రశ్నలో ఎన్ని చిక్కులో
ఎన్ని వింతలో ఎన్ని చింతలో

ఈ బ్రతుకు సమరములో
ఈ జనజీవన పయనములో

ఏ క్షణమున ఏమవుతుందో
ఏ బంధము ముడిపడుతుందో
ఏ అనుబంధం విడనాడుతుందో

ఎవరికి ఎవరు ఏది నీది ఏది కాదో
అంతు చిక్కని ఈ సృష్టి రహస్యం
ఆ పరమాత్ముని లీలలు ఎవరికి ఎరుక



కీర్తన 144
-----
నేనొచ్చే దారిలో
నల్లా నల్లనయ్య తొంగి చూసినాడే
తీరా తిరిగిచూస్తే దొబూచులాడాడే
ఓ మాటంటూ మళ్ళీ ముందుకు వచ్చాడే
సిగ్గులు మొగ్గలు వేస్తూ చల్లగా నసికాడే
మనసే ఇస్తావానంటూ మారాము చేసాడే
నల్లా నల్లనయ్య నావల్ల కాదయ్యొ
నలుగురిలో నను అల్లరి చేయకయ్యా నంటే
నా మీద అలిగి వాడు బుంగమాతి పెట్టాడే
కన్నెమనసు నెరుగక కోపమేల నంటే
వలదన్న వడిలోవాలి వెన్నలా కరిగాడే
వలుపులన్నీ దోచాడే వెంటనే మాయమైనాడే

కీర్తన 142
-----
మాయ రా ఇది మాయ రా
మర్మము నెరుగని మాయ రా
మట్టి బొమ్మకు ప్రాణమే పోసి
మాయా బంధాలు మన్తరిన్చిచుట్టి
మురిపించి మైమరపించే మున్నాళ్ళ ముచ్చట ఇదిరా
నారాయణుడు నాడే కలినాటకము ఇదిరా
భూటకమనే బంధాల బొంగరము ఇదిరా
నీడలేని తోడురాని గమ్యమెరుగని పయన మిదిరా
మరల మరో జన్మ ఉన్నదో లేదో
మరల మానవ జన్మ కల్గునొ లేదో
హరి హరి యని కొలవవో మనసా
హరి హరి యని తలవవొ మనసా
హరి నామస్మరణ హరించునే ఈ మాయాలన్నిమనసా
కీర్తన 141
-----
మోగించరా మోగించరా
గోకులకూన గానభజానా
కురిపించరా కురిపించరా
వెన్నెలవానా వృందావనాన
ఆడించరా ఆడించరా
వన్నెల అందెలరవళులునేనా
నన్నారే న నన నన్నారే న నానా న
నానా న నాననే నన్నానే నానా నన్నానే
మెరుపులు మెరిపించాలిరా
చక్కిలి గిలిగింతల చినుకులు రాలాలిరా
చిరునవ్వులు చిన్దిన్చాలిరా
చినదాని చెణుకులు తడియారాలిరా
మాపటేల రేపటేల నని మరావాలిరా
మాధవుని మాయామోహంలో మురవాలిరా
నన్నారే న నన నన్నారే న నానా న
నానా న నాననే నన్నానే నానా నన్నానే
కీర్తన 140
-----
నా చేయి విడువకు రా....
నీ చేయి జారనీకు రా....
సాయము చేయరా దేవా.................
జన్మ జన్మలకు.... ఆజన్మాంతము...
రుణపడి ఉంటాను.... దేవ.. దేవా....
నీ నిజరూపానికి మోకరిల్లి ప్రణమిల్లితీని
నీ పాదపద్మాలలో తలవాల్చితిని.....
ఆర్తనాదముతో ఏకరువుగా ఆర్జించితిని..
నా కన్నీటికెరటము నీపాదతీరాన్ని తాకగ
తక్షణమే అమ్మలా అక్కున చేర్చుకొంటావని
అయ్యల్లా అభయమిచ్చి ఆదుకొంటావని
చేయి చాచి అడుగుతుంటిని....
దాసుడిగా దేవదేవునికి అర్పించుకొంటిని
నన్ను నీవాడననుకోని నారాయణా
నను నీలో ఐక్యము చేసుకోరా.......
ఏడుకొండల వాడా వెంకటరమణ
గోవిందా............... గోవింద...
కీర్తన 139
-----
ఇష్టమో కష్టమో స్వామి
నాకోరిక తీర్చరా స్వామి
సమ్మతమో కాదో, అర్హుడనో కాదో
న్యాయమో ధర్మమో అవునో కాదో
నేనెఱుగ నాకోరిక తీర్చరా స్వామి
సప్తగిరులను చేరి సావసం చేసి
శనివారం నీకై ఉపవాసం చేసి
అక్షర అర్చన పదాలతో పాదసేవ చేసి
సరాగాలతో సంకీర్తనసేవ చేసినాను
కొండకు నను రప్పించుకొంటావో
కరుణతో కొండ దిగి వస్తావో
ప్రత్యక్షమై పరమాత్మా కోరిక తీర్చవా
తిరుమలేసుని నను తిలకించనీవా

కీర్తన 138
-----
మిత్రమా మిత్రమా మౌనంవీడవా
ప్రాణామా ప్రాణామా పలుకరించవా
వేయవా నా మనసులో స్నేహబీజం
నిలువనీ నా మదిలో నీ భక్తిధ్యానం
అటు ఎటు మరలనీకు నా చూపు
గమ్యం లేని గాలిపటం కానీకు నాబ్రతుకు
కనులముందు కదిలాడని నీ రూపం
చూసుకొంటూ మురిసి మరచిపోనీ ఈప్రాణం
స్నేహితుడై చెంతకు చేరదీయ్యగరావ
ఆప్తుడువై ఈప్రాణాన్ని ఆదరించగరావ
సదా నీ సేవలోఈస్నేహాన్నితరించనీవా
వాసా శ్రీనివాసా... ఈశా వేంకటేశా....
గోవిందా హరి గోవిందా భజ గోవిందా
కీర్తన 137
-----
సిగలో మల్లెలు
నిన్ను చూసి సిగ్గాయె శ్రీనివాసా
ఎదపై నగవులు
నిన్ను చూసి నవ్వాయె వెంకటేసా
కాలికి అందెలు
గల గలనంటూ గోలచేసె గోకులవాసా
చేతికి గాజులు
కిల కిలనంటూ అల్లరిచేసె శ్రీనివాసా
కాటుక కన్నులు కొండలకేసి
ఏడుకొండలకేసి చూసే వెంకటేసా
మనసాయెరా వాసా రావోయి శ్రీనివాసా
ఏడుకొండల వెన్నెల వన్నెల వెంకటేసా
మాపటేల మబ్బే మసకేయాలి
సిరి సిగ్గుమొగ్గలు పూయించాలి
అలిమేల ఆకు వక్కా పండించాలి
రావా వాసా సహవాస శ్రీనివాసా
కీర్తన 136
-----
వెల్‌కమ్ టు ఏడుకొండలకు
వేంకటేశుని దర్శించుకొనేందుకు
కోరిన వరాలు పొందేందుకు
పాపాలను పరిహారామయ్యేందుకు
బ్రతుకు సుఖమయమయ్యేందుకు
మనజన్మ ధన్యమయ్యేందుకు
వెల్‌కమ్ టు ఏడుకొండలకు
వేంకటేశుని దర్శించుకొనేందుకు
ఆ చిరునవ్వులో సిరులెన్నో రాలు
ఆ అభయంతో కష్టాలేన్నో తీరు
ఆ నిజరూపంలో శ్రీహరిని చూడు
మోక్షము పొంది స్వర్గధామం చేరు
వెల్‌కమ్ టు ఏడుకొండలకు
వేంకటేశుని దర్శించుకొనేందుకు
చూపు నిచ్చు మంచి మాట వచ్చు
నడక వచ్చు, తోడై వచ్చి గమ్యం చేర్చు
చీకు చింతలు లేని బ్రతుకునిచ్చు
వెల్‌కమ్ టు ఏడుకొండలకు
వేంకటేశుని దర్శించుకొనేందుకు
మోక్షము పొంది స్వర్గధామం చేరేందుకు
కీర్తన 135
-----------
అందాల మందారమా ఆనంద సింధూరమా
కైవల్య కాశ్మీరమా స్వర్గాపురి పారిజాతమా
వినువీధిలో మెరిసే తారల తన్మయత్వమా
పరమాత్ముని ప్రియప్రణయ నీరాజనమా
సిరుల సింగారమా నల్లనికురల నయగారమా
పసిడివన్నెల పున్నమివెన్నల శోభాయమానమా
ఉలులు చెక్కని కుంచెలు రాల్ఛని కలము కందని
మంజీర మకరంద మాధుర్య మాణిక్య వీణామృత
కుందరదన చంద్రవదన కనులనయన కాంతిసదన
మంగళకారిణి భాగ్య ప్రదాయిని శ్రీహరి సహచరిణి
అక్షరాలతో ఆర్చించి పదములతో పాదార్చన చేసి
భావనామృతము రంగరించి భక్తిగంధం పూసి
ఆర్తితో భక్తితో శ్రద్దతో నీ పాదాలకు ప్రణమిల్లితిని
అమ్మా ఆరాధ్య దైవమా ఆతిధ్యాన్ని స్వీకరించుమా
కీర్తన 134
-----------
దీపమా ఓదీపమా నాప్రాణదీపమా
దైవమా ఓదైవమా నాపాలిదైవమా
రాయిలోని దైవమా రప్పలోని దైవమా
రాతిని నాతిగ చేసిన దైవమా
రాగానికి కరిగే కరుణాలవాలమా
రాయిగా మిగిలిపోకు రాతిగానిలిచిపోకు
దైవమా ఓదైవమా నాపాలిదైవమా
గుండెల్లోని దీపమా గగనాన దీపమా
జీవానికి వెలుగునిచ్చే ప్రాణదీపమా
జగానికి వెలుగునింపే నాపాలిదైవమా
వాలిపోకు దీపమా మసకబారపోకు దీపమా
నీ వెలుగే లేక ఉదయం లేదులే
నీ దయనే లేక దారే లేదులే
సృష్టిని వెలిగించే సూర్యదీపమా
చిరుదెవ్వెవై చిరుప్రాణానికై స్పందించవా
శంకరా శివశంకరా హరిహరా
ఈశ్వరా ప్రాణేశ్వరా వెంకటేశ్వరా
కీర్తన 133
-----------
బేరమేల నయ్యో కన్నా
కాళ్ళబేరమేల నయ్యో కృష్ణా
వలదంటే వలదయ్యో వాసుదేవా
వేణుగానానికి వేవెల గోపెమ్మలు
నల్లనయ్య చుట్టూ అందాలు
నందనాలు ఆడుతారన్నావె
ఈ రాధ ప్రేమ నీకు ఏపాటిది
బేరము కాదే భామా ఇది ప్రేమ
కపటప్రేమ కాదే కలకాలం ప్రేమ
నింగిన తారలు ఎన్నిఉన్న
పండు వెన్నెల జాబిలి వెలుగే వేరులే
వేవేల గోపెమ్మలు చుట్టున్నా
మనసున ఉన్న రాధమ్మే ముద్దులే
ఆడవద్దు ఆడవద్దు అబద్దాలయ్యో
కల్లి బొల్లి మాటలతో మోసమేలనయ్యో
అంతా నీవెనని నమ్ముకోని వస్తే
అందరు నావారు జగమంతా నావారు
నంటూ నను ఒంటరిగా ఒదిలి వెళ్ళలేదా
నా మనసు చిన్నబుచ్చలేదా.....
నమ్మవే నా రాధ నీ నల్లనయ్యని
వెన్నలా కరిగిపోయే కన్నయ్య మనసును
అందరు నావరైనా నేను నీవాడనేలే
జగమంతా నేనైనా నా లోకం నీవేలే
ఒంటరిగా చేయలేదు నిన్నెపుడు
నా మనసులో దాచుకొన్నా నిన్నెపుడు
కీర్తన 132
-----------
ఇష్టమోయ్ రాంబాబు నీవంటే ఇష్టమోయ్
కట్టమోయ్ రాంబాబు నీవులేకుంటే కట్టమోయ్
మనసంతా నీమీద నాయేరా రాంబాబు
మట్టమని మనువు నాడననుకోయ్ రాంబాబు
మదిలోన నిను తలచుకొంటూ
మనసారా నిను కొలుచుకొంటూ
ఏకాంత సేవన నా మొర ఆలకిస్తావని
గుండెలలో నిన్ను ఎట్టేసుకొని
గంపెడెంత ఆశతో గుడి కొచ్చినాను
తీరా చూస్తే నీ చుట్టూ పదిమంది నాయే
అటు సీతమ్మ ఇటు లక్ష్మయ్య
ముందు హనుమంతు వెనుక గరుక్మన్తు నాయే
నా మొర నాలకించు వారెవరు రామ
నా మన బాధనుదించు వారెవరు రామ
ఇష్టమోయ్ రాంబాబు నీవంటే ఇష్టమోయ్
కట్టమోయ్ రాంబాబు నీవులేకుంటే కట్టమోయ్
కీర్తన 131
-----------
నింగి లోని తార
నేల మీదకు దిగిరావ
గగనాన నున్న దేవా
గుడి శిఖరాన్ని చేరరావ
జాగాన్ని నేలే దేవా
జీవమై ప్రాణన ఒదిగిపోవా
గుడిలో నీవై గోకులానా నీవై
ఎదలొ నీవై ఏడుకొండలపై నీవై
ప్రాణాన నీవై పరమాత్మావు నీవై
కను లెదుట నీవు కాన వస్తుంటే
హృదయం వెన్నెలై వెలుగుతుంటే
మనసు మల్లెలై ముగింట రాలుతుంటే
ఆడి పాడుతూ పాడి ఆడుతూ
ప్రాణం నీసన్నిధిలో పరవశమవుతుంటే
కన్నుల పండగే కదా స్వర్గం ముంగిటే కాదా
హరే రామ రామ , శ్రీరామ రామ........
కీర్తన 130
-----
వేదాలు చదివినాను రామచంద్ర
బంధాలు వదలినాను రామచంద్ర
పాణాలు నీలో లీనముచేసినాను
పాదసేవకై పరుగెత్తుకవచ్చినాను
రామచంద్ర శ్రీరామచంద్ర
రామచంద్ర రఘురామచంద్ర
కొండలెక్కి ఏడుకొండలెక్కి వచ్చాను
ఎదురేగి వస్తావని వెతికినాను
ఆదరించి అక్కున చేర్చుకొన్టవని
అశ పడి అంతా వెతికినాను
రామచంద్ర శ్రీరామచంద్ర
రామచంద్ర రఘురామచంద్ర
రానంటే నాకు ఇంకెవరు రామచంద్ర
కాదంటే దారి నాకేది రామచంద్ర
ఏమి కావాలో కోరుకో రామచంద్ర
నా పాణమైన నీకిస్తా రామచంద్ర
ఏమి చేయాలో చెప్పుకో రామచంద్ర
దాసాను దాసుడనావుతాను రామచంద్ర
రామచంద్ర శ్రీరామచంద్ర
రామచంద్ర రఘురామచంద్ర
కీర్తన 129
-----
పూజకి పనికి రాని పువ్వునైతిని
పాటకి పనికి రాని పల్లవినైతిని
ప్రేమను నోచుకోని ప్రియురాలినైతిని
కనులున్న కన్నయ్యను కాంచలేకపొతిని
ఎద నిండుగ నీరూపం నిండినా
భావము తెలుపలేని బంధీ నైతిని
మనసునిండా మల్లెలు విరబూసినా
మాధవుని మురిపెము మురవరము
లేక కొమ్మకే వాడి వాలిపోతిని
అడవిలోకాచిన అందాల వెన్నలనైతిని
మూగబోయిన అందెల రవమునైతిని
వృందావనమున కన్నీటి సంద్రమైతిని
కాలమే ఇక రాడు కానరాడునని కదిలితే
మనసు తహతహలాడే మది ఊగిసలాడే
హృది గిలగిలలాడే ప్రాణం విలవిలలాడే
కన్నా.............కృష్ణా.............కరుణలేదా
మాధవా....ముకుందా... రాధ మనసునలేదా
గోవిందా... గోకులానందా..బృందా గురుతులేదా
కీర్తన 128
-----
నల్లా నల్లని వాడే
చల్లా చల్లని చందమామను
మెల మెల్లగా రమ్మన్నాడే
కొమ్మన చేరాడే గ్రోవిని ఊదాడే
మనసున దూరాడే వడిలో వాలాడే
నదిలో దూకాడే పడగన నాట్యమాడాడే
కంసుని వధించాడే చెరసాలను వదిలించాడే
వేవెల గోపెమ్మలకు గోపాలుడయ్యాడే
గిరినే ఎత్తాడే గోకులాన్ని నిలిపాడే
యసోదా నందనుడు రాధా మోహనుడు
భామా వల్లభుడు రుక్మిణి రమణుడు
ఈ నల్లా నల్లని వాడే నందగోపాలుడే
కీర్తన 127
----
కురిసే ప్రతి చినుకు కడలిని చేరు కడకు
ఎగిసిపడే ప్రతి కెరటం తీరం చేరు చివరకు
పుట్టే ప్రతి ప్రాణం పరమాత్ముని చేరు పరమార్ధం కొరకు
రాలిన ప్రతి విత్తు తిరిగి చిగురించక మానదు
అస్తమిన్చిన సూర్యుడు తిరిగి ఉదయిన్చక మానడు
వెళ్ళిన ప్రతి ప్రాణం మరలా జన్మించక తప్పదు
కానీ కాల గమనం ఆగదు
మన బ్రతుకు తీరు మారదు
ఈ మాయా లోకంలో ఇంకెన్నాళ్ళొ
ఎన్నాళ్ళొ ఎన్నెళ్ళొ ఎవరికి ఎరుక
కానీ ఒకరంటే ఇంకొకరికి ఎందుకో కినుక
మతం లేదు కులం లేదు నీది లేదు నాది లేదు
మత్తు వీడరా కక్ష వద్దురా మనసు మార్చుకోరా
సాటి మనిషికి సాయపడరా చరితలోన మిగిలిపోరా
సదా శ్రీనివాసుని సేవించి స్వర్గాపురి చేరిపోరా..
కీర్తన 126
-----
హిందూ బంధువులారా
భావిభారత సోదరిసోదరులారా
కులమువిడిచి గొత్రముమరచి
మన జాతిని కాపాడేందుకు
మన సంస్కృతిని రక్షించేందుకు
రండి చేయి చేయి కలపండి
నడుం బిగించి ముందుకు కదలండి
శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదులే
సర్వలోక నాయుకుడు శ్రీహరినేలే
జగత్తుకు మూలం మన జాతేలే
పొరుగువారు పొగబెడుతుంటే
మనవేదాలు మంటగలిసిపోతుంటే
మనజాతికి ఎసురుపెడుతుంటే
రండి చేయి చేయి కలపండి
నడుం బిగించి ముందుకు కదలండి
మన హైందవజాతిని కాపాడండి
ముందుతరాలకు వేదాలను అందించండి
జై శ్రీరాం .............జై జై శ్రీరాం.......
కీర్తన 125
-----
ఓ రామయ్యా సీతారామయ్యా
మా ఇంటికి రావయ్యా
మా కంటికి కనరావయ్యా
ఇక్ష్వాకుల తిలకా మీరాకతో
మా ఇల్లే మందిరమాయె
నిగనిగలాడే నీలాలచంద్రుని చూచి
మానయనాలే నందనాలాయే
నీ పాదస్పర్శతో పుడమి పులకించె
పూలనందనమై పరిమళాలు వెదజల్లె
నీ శ్వాసతో చిరుగాలి వేణుగానమై
సహస్రనామార్చన చెసెనయ్యా...
నీపారిజాత పాదములు సేవించే
భాగ్యము కల్పించవేరా రామయ్యా
ఈపాదదాసుడను దయతో కరుణించి
నీలో లీనముచేసుకో సీతారామయ్యా
కీర్తన 124
-----
కౌసల్య రాముని కీర్తన ఎత్తుకొని
కోలాట మాడుదామా కోలాట మాడుదామా
కౌసల్య రాముని కోవెల ముంగిట
కన్నుల పండుగగా కోలాహలముగా
సీతారాముడు సంతసించునట్లుగా
మన కలలు పండించునట్లుగా || కోలాట||
గళము కలిపి రామమంత్రము పలికి
అడుగు కదిపి భజనన కలిసి
తారకరామునిలో లీనమై తనువు మరచి
కోలాట మాడుదామా కోలాట మాడుదామా
కౌసల్య రాముని కీర్తన ఎత్తుకొని
కోలాట మాడుదామా కోలాట మాడుదామా
రామ రామ జయ రామ రామ పరంధామ
రామ రామ శ్రీ రామ రామ రఘురామ పరంధామ
జయ జయ రామ జానకి రామ
జయ జయ రామ జగదభి రామ
రామ రామ శ్రీ రామ రఘురామ
రామ రామ జయ రామ పరంధామ
రామ................ .......... .....
శ్రీ రామ.............. ....... .......
కీర్తన 123
----
అడుగో రాముడు ఇడుగో రాముడు 
అడుగో అడుగో అందాల రాముడు 
ఇడుగో ఇడుగో ఇక్ష్వాకుల రాముడు
అందరి మనఅందరి ఆరాధ్యదేవుడు 
కొలచిన వారికి కరిరాజ వరదుడు
బాణాలతో బంధము వేయువాడు 
భక్తుల బంధువైన భద్రాద్రి రాముడు
రాళ్ళనైనా కరిగించు రఘురాముడు 
రాగాలకు కరిగే రవికుల సోముడు
వెతలు బాపు వెంకట రాముడు 
సిరులు దొరలించు సీతారాముడు
అడుగో రాముడు ఇడుగో రాముడు 
అడుగో అడుగో అందాల రాముడు 
ఇడుగో ఇడుగో ఇక్ష్వాకుల రాముడు
కీర్తన 122
-----
పాటపాడనా నీకోసం
ప్రాణమివ్వనా నీకోసం
పాటపాడనా ప్రాణమివ్వనా
పరమాత్మా పరంధామా నీకోసం
ఎదలో పదిలంగా దాచుకొన్న
ప్రాణానికి ప్రాణమైన పాటను
తీయ్యని ఆధారాలతో తేటనైన
తేనె మధురిమలా పాడనా
వెంకటేశునికి వీనులు విందుగా
తిరుమలేశునికి తీయ్యని తీపిగా
పద్మావతిపతికి ప్రేమ పెంపొందగా
పాడనా పాడి పరవసెంతో ఆడనా......
చక్కెరకేళీలాంటి సంకీర్తన చేయనా
శ్రీనివాసుని సంతసింప జేయనా
లేక నా పంచ ప్రాణాలనే పంచనా
హరికి హారతినై కరగనా..........

కీర్తన 120
------------
తిరుమలేశా తిరుమలేశా
తిలకించిన చాలు తీయ్యని తన్మయత్వము
కను చూపులో కారుణ్యము
చిరు నవ్వులో శరణ్యము
చేయి ముద్రలో అభయము
కరిగించెను కఠిన హృదయము
సప్తగిరుల శిఖరము అంచున
సాగించెను శ్రీనివాససంకీర్తనము
పాదసేవలో పాపం హరించి
పదసేవలో ప్రాణం పరవశించి
హరుని జఠాజఠమున ఎగిసిన
హరివిల్లుల పావన పద గంగై
కొండ కోనల నడయాడి
కొండలరాయుని కాళ్ళు కడిగి
కరుణాసాగారాన్ని చేరే గానము
కీర్తన 119
------------
చేయకురా నలుగురిలో నను చులకన
నీ చెంత చేరినానని నీ శరణు వేడినానని
ఊహ తెలిసిన నాటినుంచి నిన్నే వేడుకొంటి
నడక నేర్చిన నాటినుంచి నిన్నే నమ్ముకొంటి
మాటవచ్చిన క్షణంనుంచి నిన్నే స్మరించుకొంటి
శ్రీనివాసా సర్వదా నీ సేవలో మునిగి తేలుతుంటి
చేతులెత్తి మొక్కి శరణు వేడుతున్నా
చేయిచాచి అడుగుతున్న సాయము చెయ్యమని
అడుగు అడుగున అడ్డంకులు కల్గించకయ్యా
అయినదానికి కానిదానికి పరీక్షలు పెట్టకయ్యా
అక్కున చేర్చుకొనే ఆప్తుడని
ఆర్జించు చున్నాను అక్కరకు రాలేవా
కష్టాలలో గెట్టెక్కించు కరుణాసముద్రుడని
కన్నీటితో కాళ్ళుకడిగి కొలచినా కరుణించలేవా
భక్తులను బ్రోవు భగవంతుడని
భజించినానయ్యా నను బ్రోవరావయ్యా..
ఏడుకొండలవాడ ఏడేడు కొండలవాడ
కీర్తన 118
------------
ఏడుకొండలవాడ ఏది నాకు దారి
ఏడు ఏడు ఏడుకొండలకు ఏది దారి
గుండెల్లో నిను దాచాలన్నా
కళ్ళల్లో నిను నిలపలన్నా
మనసారా నీతో మాటలాడాలన్నా
ఏడుకొండలవాడ ఏది నాకు దారి
గుండెల్లో ఉండమంటే గుడిలోన చేరావు
కనులెదుటె ఉండమంటే కొండల్లో దాగావు
మాటలడుతుంటే మౌనంగా ఉంటావు
ఏడుకొండలా ఏగేది ఎట్టరా చేరేది ఎట్టరా
చూసేందుకు చంద్రుడుల్లె చల్లగుంటావు
చెంతచెరితే సూర్యుడల్లే భగ్గుమంటావు
పారిజాత పువ్వుమల్లె పరిమళిన్cచుతుంటావు
పట్టు కొన్దామంటే ముళ్లై గుచ్చుకొంటావు
ఏడుకొండలవాడ ఏది నాకు దారి
ఏడు ఏడు ఏడుకొండలకు ఏది దారి
కీర్తన 117
------------
రంగురంగు చీర కట్టి రంగురంగు గాజు లేసీ
అంగరంగ వైభవంగా ఉన్నావే రంగనాయికి
వేగ రమ్మని ఏడుకొండలు దిగి రమ్మని
కబురు నంపనా కొండల రాయుడికి
మెరుపు ముక్కుకుచుట్టి, ముచ్చటగా వున్నవే
రవ్వల లోలాకులుతో లావణ్యముగా వున్నావే
కళ్ళకు కాటుక దిద్దినావే కలువకనుల సుందరి || వేగ రమ్మని ||
సందె సూర్యుణ్ణి సింధురముగా అద్దినావే
వెన్నెల జాబిల్లిని చంద్రవంకగా చేర్చినావే
చుక్కలన్ని సన్నజాజులుగా ముడిచినావే
సింగారాల సోయగాల సొబగుల చిన్నది || వేగ రమ్మని ||
రా రావోయి రంగ రంగ రంగనాధ
రాతిరంత రంగవల్లు లేయాలిరా
జామురాతిరి జాతర చేయాలిరా
పాలకడలి పరువాలు పొంగాలి నని || వేగ రమ్మని  ||
కీర్తన 116
----
బాపనోల్ల సదువుల దేవుడా బమ్మదేవుడా
బడుగుల బతుకులు సూడు సిమ్మదేవుడా
గుళ్ళోన చేరినావు అయ్యోరిని రమ్మన్నావు
అభిసేకాలు అర్చనలు చేయించుకొంటూ
పూల మునిగి పాల తేలి పసాదాల తింటూ
బాపనోల్ల సదువులకు మురిసిపోకురా
బడుగులమని మమ్ము మరచిపోకురా
గుడినొదలి నొకసారి రారా గోవిందుడా
మా కట్టాలను సూడరా సీతారాముడా
కన్నీల్లును తుడవరా తిరుమలేసుడా
పాణాలును కాపాడరా పరమాతుడా
మందిరానికి ఇటిక మొసింది మేమేకాదా
నీఇందిరానికి మల్లెలు గుచ్చేది మేమేకాదా
నీపల్లకీనీ ఎత్తుకొనే బోయులు మేమేకాదా
నీపాదాలను పవిత్రగంగతో కడిగేది మేమేకాదా
సీన్నోల్లమని సూడకొంటె ఎట్టాగా సామీ
మవొల్లన్దరు మతము మారుతుండారు సామీ
మిగిలి నోల్లకైనా మంచి దారి సూపు సామీ
మమ్మూ మా దేశాన్ని సల్లంగా సూడు సామీ
ఓ సిమ్మము సామి ఓ సీనయ్య సామి

ఈ పాట బ్రాహ్మడు చండాలుడు కి మధ్య కాదు . బాపనోళ్ళ చదువుల అంటే వేదాలు అని రైమింగ్ కోసము వాడిన పదమే కాని సోసలిసం కోసం కాదు .చివరి 4 లైన్స్ చుడండి మతము మారుతున్నారు ..దాన్ని అడ్డుకొనే వారు ఎవరు లేరు ..దాని నుంచి దేశాన్ని కాపాడండి అన్న భావన తో రాసింది

కీర్తన 115
------------
ఆలయాన దేవుడు అందరికి దేవుడు
అంతరాత్మలో ఈ జీవుడు
అందరి అంతరంగానికి పరమాత్ముడు
కొలుచుటకు సులువైన దేవుడు
కోవెలలో కొలువైన కౌసల్యరాముడు
అందరికి అంతుబట్టని అంతరాత్ముడు
అనంతానికి ఆలవాలమైన సర్వేశ్వరుడు
జీవులకు జగములకు తావైన జగన్నాధుడు
జపమునకు తపమునకు లయయైన దేవుడు
అభిషేకానికి అర్చనకి ధ్యానానికి గానానికి
అలంకారమైన ఆనందనందనుడు ఆదేవుడు
ఆలయాన కొలచిన ఆవల తలచినా
పాదాలను సేవించినా పేరుతో పిలిచినా
ప్రియముగా పలుకును పరమాత్ముడు
నచ్చిన మెచ్చిన చందముతో సేవించర నరుడా
తక్షణమే వరియించును నిను ఆ వేంకటేశుడు
కీర్తన 114
------------
రాముడు దేవుడై నా గుండెల్లో కొలువైనాడే
రాముడు గోవిందుడై నా గళము లో నిండినాడే
కౌసల్య రాముడై కనులెదుటే నిలిచినాడే
ముకుందా రాముడై మనసున నిండినాడే
కలలోకివస్తాడు కోరినవన్నీ ఇస్తాడు
కంటికి కనురెప్పలా కపాడుకొంటాడు
నా దేహమే దేవాలయముగా మలచుకొన్నాడు
నా హృదయాంతరాల గర్భగుడిలో కొలువైనాడు
నా ప్రాణము పెమ్మిదై స్వామి సన్నిధిలో వెలుగగా
పలికే ప్రతి పదము పువ్వై పాదాల చెంత రాలగా
పాడే ప్రతి పాట పరమాత్ముని పాద సేవకై సాగగా
నా గానమై నాడు నా ప్రాణమై నాడు నాకు సర్వమైనాడు
రాముడు రఘురాముడు ఏడుకొండల రాముడు
రాముడు శ్రీరాముడు నా సక్కని సీతారాముడు


కీర్తన 113
------------
రా రమ్మన్నావు
రమ్మన్నావని రాగ కానరానన్నావు
కన్నతల్లిని మరచి
ఉన్న ఊరిని విడిచి
నమ్మిన దైవానికై నడచి నడచి
పదము పదమున నీనామముతో
అడుగు అడుగున నీ జపంతో
నీ పాట పాడినాను నీ బాట బట్టినాను
భక్తుడనై నీ భజన చేసుకొంటూ
దాసుడనై నీ సేవకంటూ పరవశాన
ఆనందగంగలా పరవళ్ళు తొక్కుతూ
కొండ కొచ్చినాను ఏడుకొండలకొచ్చినాను
ఎదురేగి వస్తావని అంతా వెదికినాను
హే రంగా రావా హృదయాంతరంగా రావా
నీ పాదస్పర్శతో పావనగంగనై పరవశించనీవా...
కీర్తన 112
------------
కదలని బొమ్మకు
కీర్తనలెన్ని చేసినా వినునా
మారని మనసుకు
మమతలెన్ని అద్దినా మారునా
కఠిన హృదయానికి
ప్రేమలెన్ని పంచినా కరుగునా
బొమ్మ కదలనే కదలదు
మనసు .మారనే మారదు
హృదయము కరగనే కరగదు
ఇక నాఆశ తీరనే తీరదు
భువిలొ నేనై దివిలొ నీవై
దూర దూరమై కనరాని వాడవై
ఘడియొక యుగము గడుచుచున్నా
దేవదేవా నాపై దయతలచకున్న
ఎవరికై ఈ గానం ఎందుకీ ఈ ప్రాణం
హద్దెలేని గగనాన ఎచటికొ ఈపయనం

కీర్తన 111
-----------
రాతిరంతా చందమామ నిదుర పోదు
రాగమే ఆలపించక మనసు ఊరుకోదు
తెల్లవారితే సూర్యుడు ఉదయిన్చక పోడు
తిరుమలేశుని తలవనిదే పొద్దు పోదు
రామా...... నీనామామె నాకు రాగమాయె
రఘురామ నీరాగమే నాకు బ్రతుకునాయె
అనుదినము ఆనందమానందమాయె
అణువణువునా మనసు పరవశమాయె
తనువంతా తిరుమలేశుని కోవేలాయె
బ్రతుకు తేనేలూరే తీయ్యని లడ్డునాయే
రామా...... నీనామామె నాకు రాగమాయె
రఘురామ నీరాగమే నాకు బ్రతుకునాయె
రాతిరంతా చందమామ నిదుర పోదు
రాగమే ఆలపించక మనసు ఊరుకోదు
తెల్లవారితే సూర్యుడు ఉదయిన్చక పోడు
తిరుమలేశుని తలవనిదే పొద్దు పోదు
రామా...... హరే రామా...... శ్రీరామా......
కీర్తన 110
------------
దేవుడా ఓ దేవుడా నీవంటే నాకు ఇష్టము
దేవుడా నిను కొలవకుంటే నాకు కష్టము
గుడికి వద్దమంటే గూడు దూరమాయె
బంధాలలో చిక్కి బ్రతుకు భారమాయె
పనిచేసి వద్దామంటే పొద్దు వాలిపోయె
బండి లేక భద్రాద్రి బహుదూరమాయె ||దేవుడా||
వేదం చదవాలని అర్చన చేయాలని
పూలెన్నో తెచ్చి పాదసేవతో తరించాలని
ఆశపడితినే రామా ఆరాటపడితినే రామా...
తీరాచూస్తే కోవెల మూసినారు రామా ||దేవుడా||
గుడిలోన నీవు గుడిఆవల నేనైన వేళ
మది మాధవుడేడీనని మారాము చేసే
హృది గోవిందుడేడీనని గోలమొ చేసే
కన్నులు నినుకాంచాలని దిక్కులు వెదికే ||దేవుడా||
కన్నీటి సుడులు తిరుగుతుంటే
మనసు కెరటమై తిరిగివెళుతుంటే
దశావతారకరాముడు దూరమవుతుంటే
ఎవరిని వేడుకోను ఏడుకొండలవాడా...
ఏమని వేడుకోను ఏడుకొండలవాడా... ||దేవుడా||
కీర్తన 109
------------
వేదము నాదము ఎరుగనైతిని
వాదన నేలనయ్యా వేదన వినరావయ్యా
ఏడుకొండల వెంకట రమణయ్యా
నీనామమే గానముగా
నీగానమే ప్రాణముగా
జపించి తపించువాడనయ్యా
జగడమేలనయ్యా జాలిచూపవయ్యా
జగమేలు జానకిరమణయ్యా
ధ్యానము దాస్యము చేయనైతిని
దండించకయ్యా దయచూపుమయ్యా
దర్శనమీయ్యవయ్యా దశావతారక రామయ్య

కీర్తన 108
------------
ఆ మబ్బు ఈ మబ్బు
ఏమబ్బులో ఉన్నావు స్వామి
ఆ కొండ ఈ కొండ
ఏకొండపై కొలువైనావు స్వామి
గగనానికి గానమై నేనెగసి
చిరుగాలినై నిను తాకి
నింగినుంచి నేలకు రప్పించి
అమృుతముగా కురిపించి
చిరుదివ్వెగా వెలిగించగలనా || ఆ మబ్బు||
కొండకొండకు మెట్టునై
ఏడుకొండలు నేనెక్కి రాగాలనా
ఏడేడుకొండలు నే వెదకగలనా
కోవెలలో కోకిలై కూయగలనా || ఆకొండ||
ఉరుమై వాయుమేఘాన
మెరుపై మనసువేగాన
దాగుడుమూతలు ఆడక
దేవుడవై ధరణికి చేరరారా
ధర్మము నిలుపగ రారా
ఏడుకొండలవాడ వెంకటరమణ
గోవిందా .................గోవింద


కీర్తన 107
------------
అందమైన వాడవని
అందరాని వాడవని
అందరు అన్నారు
పొందరాని వాడవని
పలుకలేని వాడవని
పకపక నవ్వారు
చిలుకై పలకవా
బదులే ఇవ్వవా
నమ్మకం నిలుపవా
దయ తలచువాడవని
దేవుడు ఉన్నాడని
నీఉనికిని చాటవా
చలనం లేనివాడని
శిలగా నిలిచినవాడని
శరణు నేమిచ్చునన్నారు
నీలీలలు చూపవా
నీమహిమలు తెలుపవా
నీదర్శనం ఇయ్యవా....

కీర్తన 106
------------
నీవు రాక నాకు గతి ఎవరు
నీవు గాక నాకు శ్రుతి ఎవరు
సర్వలోక శరణాగతుడవని
సర్వాకాల సర్వజగద్రక్షకుడవని
సదా నిను నమ్మితిని......
సర్వదా నిన్నే సేవించితిని
యతియని తలచి స్తుతి సలపి
సతము నిను మరువక కీర్తించి
నీ నామము నిరతము భజించి
నీ పాదము సతతము సేవించి
శరణుశరణు శ్రీరామ యని తలచి
పాహిమాం పాహిమాం యని ప్రార్ధించినా
కొండల రాయుడు కానరాక పోతే
కోదండ రాముడు మొరవినక పోతే
ఎందుకో ఈ జీవం ఎవరికో ఈ సంకీర్తనం
ఎచటికో ఈ పయనం ఎందుకో ఈ ప్రాణం
కీర్తన 105
------------
అమ్మని అడిగా నాన్నని అడిగా
జనులని అడిగా జగముని అడిగా
అందరిని అడిగా అంతయు వెదికా
నాదైవం ఏడని నారాముడు ఏడని
సంద్రం వెదికా చంద్రుని అడిగా
చుట్టాల నడిగా చుక్కల నడిగా
మల్లెల నడిగా మేఘాల వెదికా
నాదైవం ఏడని నారాముడు ఏడని
కొండల నడిగా కోనల వెదికా
ఏడి వాడేడి ఏడుకొండల వాడేడి
చూడ చూడ పరికించి చూడ
చేరియున్నాడు శ్రీనివాసుడు
నాలో నా చిన్ని హృదయంలోన



కీర్తన 104A
------------
చూడకు చిలిపిగా నను చూడకు
సిగ్గులమొగ్గలు పూయించకు
చెంత చేరవద్దన్నానా
చేరి సరసాలాడొద్దన్నానా
ఏలరా సిగ్గేలరా
నంగనాచి నందనందన
నానుదిటన నీవే సింధూరం
నానడుమున నీవే వడ్దానం
నామేనికి నీవే సింగారం
నానడకకు నీవే నయగారం
అందించరా చేయినందించరా
మురిపించారా మైమరపించరా
కీర్తన 104
------------
నీలాల నీలిమేఘశ్యామునికి
నిండు జాబిల్లికి బొండు మల్లికి
నిత్య కళ్యాణమే నవ వసంతమే
కొండలరాయుడికి కలువుల నయనాలకి
కల్యాణ వైభొగమే కనులకు కమనీయ్యమే
నింగిన పచ్చనిపరిణయ తోరణాలు
నేలమీద అంబరాన్నంటే సంబరాలు
జగమంతా జగన్నాధుని జాతరలు
ముక్కుపచ్చలారని ముద్దుగుమ్మలకు
ముత్యాల రతనాల మురిపాల తలంబ్రాలు
అంబరాన్నుంచి రాలిన అత్మీయ్య అక్షింతలు
దివినుంచి దేవాదిదేవుల దేవతల దీవెనలు
నరులకు నయనాలకు కన్నుల విందులు
కీర్తన 103
------------
నింగిలోని నెలవంకా చూడవా నావంక
గూటిలోని గోరువంకా రావా నావంక
దూరదూరమెందుకోయి దరిచేరరావోయి
దాగుడుమూతలేలోయి దర్శినమీవోయి
గ్రోవి పిలిచెనోయి గూడునొదలి రావోయి
బృందావని ఆశగాచూసే గోపాలుడు ఎదురేచూసె
ఇష్టమైన కష్టమైన రాకమానునా
వేణుగానానికి వౄందా ఆడకమానునా
గోపాలురు గోపికలు ఎందరు చుట్టున్నా
గోపగోపికవు నీవేలె నాగ్రోవి నీదేలె
మనిషొకచోట మనసొకచోట ఇలాఎన్నళ్ళూ
మూడుముళ్ళు వేసి ఏడడుగులు నడవరాద
నేను నీవు కాదా నీవు నేను కాదా
నేనునీవు ఒకటై మనసంతా నీవేకదా
కీర్తన 102
------------
మది ఏది మరిచిన
మనసైన మాధవుని
మరువబోదు ఈ మనసు
అనురాగ సీమలో
అలవుకాని ఆనందములో
మురిసి తరించిన ఆ తరుణం
మరువబోదు ఈ మనసు
పదేపదే వల్లెవేసుకొంటూ
ప్రేమను పదిలంగా దాచుకొంటూ
ఎద పరవశమైన ప్రతి క్షణం
మరువబోదు ఈ మనసు
మనసే మందిరమై మందిరమున
మాధవుకై ప్రేమానురక్తితో భక్తితో
తననుతాను సమర్పించుకొన్న
రాధవైనం మరువబోదు ఏ యుగం
కీర్తన 101
------------
అటు ఇటు ఎటు చూసినా నీవే
అలా ఇలా ఎలా చూసినా నీవే
మాట పాట ఏమీ పాడినా నీదే
మది హృది ఎద నిండుగా నీవే
ఎందుకో ఏమిటో కొత్తకొత్తగా ఉన్నదే
చిత్ర విచిత్రంగా వింతవింతగా ఉన్నదే
అణువణువున నీవై పదపదమున నీవై
అనుక్షణమున నిన్నే క్షణక్షణమున నిన్నే
మరీ మరీ నిను చూడాలంటూ
పదే పదే నీపాట పాడాలంటూ
పరవళ్ళు తొక్కుతున్నదే నా గానము
కదంతొక్కి కదులుతున్నదే నా ప్రాణము
ఏడుకొండలవాడా వెంకట రమణ
సంకట హరణ గోవిందగోవిందా

కీర్తన 100
------------
మాఊరు దేవుడు బంగారు దేవుడు
మాఊరు రాముడు రతనాల రాముడు
మాఊరు దేవుడు నల్లాని దేవుడు
నీలాల మేఘుడు మురిపాల కృష్ణుడు
శ్రితజన పాలకుడు శ్రీవెంకటేశుడు
నిత్యము సత్యము పలికెడు వాడు
నిరతము ధర్మము నిలిపెడు వాడు
చేసిన మేలుని మరవని వాడు
చేయి చాచకనే వరాలు నిచ్చువాడు
సూర్యుని వలెనె వెలిగేవాడు
సుగుణాలకు సరిజోడు వాడు
సాగరమంత కరుణగల వాడు
జగములునేలే జగన్నాధుడు వాడు

కీర్తన 99
------------
గుడిలో నున్నవాడు
నాగూడు చేరెనే ఈవేళ
దివిలో నున్నవాడు
భువిని చేరెనే ఈవేళ
సిరిచెంత నున్నవాడు
శబరిఇంట చేరెనే ఈవేళ
పంచభక్ష పరమాన్నాలు
నారాగించు పరమాత్ముడు
పుల్లని నెంగిలి నేరేడు
పండ్లు నారగించెనే ఈవేళ
రామ రఘురామ నీరాకతో
పావనమాయె నాకుటీరము
చరితార్ధమాయె నాజన్మము
నీలో ఐక్యమైపోనీ నాజీవము


కీర్తన 98
------------
కడలికి పొంగు నేర్పింది
కవితకు హంగు అద్దింది
కౌసల్యరామ నీనామం...
కోమలికి ప్రాణం పోసింది
కోరికలకు కళ్ళెం వేసింది
పరంధామా నీపాదం...
ధనస్సు దాసోహం నన్నది
ధర్మమే నీవెంట నడిచింది
దశరధరామ నీరూపం...
జానకి జవరాలు నన్నది
జగము జయహొ నన్నది
జగదభిరామ నీవిజయం
రఘుకులతిలకా సీతానాయక
నానోట నీపాట నేలా
నాకింతకన్నా భాగ్యమేలా
కీర్తన 97
------------
అమ్మా మాయమ్మ అలిమేలమంగమ్మా
నా మొర ఆలకించవమ్మా
హరి నామమే నా గానమని
హరి గానమే నా ప్రాణమని సాగే
నాఆలాపన ఓసారి ఆలకించమని
అడగవేమమ్మా అలిమేలనాధుని
శ్రీవారి సేవ నాకు వరమని
మరలమరలా హరిదాసునై కీర్తిస్తానని
నావిన్నపము ఒకసారి వినమని
విన్నవించవేమమ్మా పతిదేవునికి
జన్మజన్మల రుణమని
జగమేలువాడిని జపిస్తూ
తిరుమలేసుడికై తపిస్తున్నాని
చెప్పవా నాతల్లి చెంతకు చేర్చుకొమ్మని...
నాస్వామి మనస్వామి శ్రీనివాసునికి


కీర్తన 96
------------
ఏలుకోవయ్యా స్వామి నన్నేలుకోవయ్యా
ఏడుకొండల స్వామి నన్నేలుకోవయ్యా
ఎలుగెత్తి నీనామం ఎల్లవేళలా కొలెచెదనయ్య
నిలువెత్తు నీరూపం దర్శించుటకై నిరీక్షించెదనయ్య
ఏమారక స్వామి ఏడుకొండలవాడా వెంకటరమణ
నామొర నాలకించగరారా నాస్వామిఏడుకొండలవాడా
ఎందున ఉన్నావయ్యా స్వామినని ఎవరు ప్రశ్నించినా
నెందునైనా గలనంటూ నిండైన వరాలు ప్రసాదించరా
ఏడుకొండలవాడా వెంకటరమణా సంకటహరణా
నేడుననుబ్రోవగ రారా నాస్వామిఏడుకొండలవాడా
కీర్తన 95
------------
పలకాలి రామనామం
పాడాలి రామగీతం
మధురమైన రామనామం
మోక్షానికి సులభమార్గం
మనోరంజక తారకమంత్రం
సప్తవ్యసన విమోచనతంత్రం
మధురమైన రామగీతం
సుధారస మందార మకరంద
సుమధర సప్తస్వర సంగీతం
మహావిష్ణువుకి మనోఉల్లాసం
అమరం అమరం రామనామం
తిమిరానికి తేజం రామగీతం
భువికి దివికి దివ్యబంధనం
భక్తికి ముక్తికి దివ్యామృతం
పలకాలి రామనామం
పాడాలి రామగీతం
కీర్తన 94
------------
ఎవరు నీవారెవరు
ఈజీవన పయనంలో
ఈజీవిత సమరంలో
అందరూ నీవారే
జనమందరూ నీవారే
జగమంతా నీవారే నని
భ్రమలో బ్రతికేవు
మాయలో మురిసేవు
బంధాలలో బంధీనయ్యేవు
భగవంతుని మరచేవు
భవములు బాపుకొనేవు
చివరకు చింతించేవు...
తేరుకోరా మేలుకోరా నరుడా
మూలము తెలుసుకోరా నరుడా
హరియే సర్వమురా నరుడా

కీర్తన 93
------------
ఇల్లు ఇల్లాలని ఈశ్వరుని
సన్నుతి మరువకే మనసా
ఇల్లున్న ఇల్లాలున్న
సిరులున్న సంపదలున్న
కావాలి నీకు ఈశ్వరేచ్చ
కలగాలి శ్రీహరి కృపాకటాక్ష
మరుజన్మ మనకు ఉందోలేదో
మాధవుని తలచగలమొ లేదో
రేపో మాపోనని జాగు చేయక
శ్రీకారముచుట్టవే శ్రీహరిస్మరణకు
మనసా వాచా కొలవవో మనసా
తూచా తప్పక తలవవొ మనసా
అదే మోక్షము అదే కైవల్యము

కీర్తన 92
------------
ఆదేశించారా దేవా
నీఆరాధనకై ఆలాపనకై
దేవాధి దేవా ఆరాధ్యదేవా
ఆపద్భాంధవా ఆలిమెలవాసా
శేషశయనవాసా శ్రీ శ్రీనివాసా
సకలలక్ష్మికళావల్లభా శ్రీవేంకటేశా ||ఆదేశించారా||
అలుపెరగక ఆరాధించెదనయ్యా
ఆనందముగా ఆలపించెదనయ్యా
నీ ఆరాధనే నాకు పరమానందము
నీ ఆలాపనే నాకు బ్రహ్మానందము ||ఆదేశించారా||
పాట నే కావాలా,ప్రేమ నే కావాలా
ప్రాణమే కావాలా ఏమీ కావాలో
ఓ పద్మావతిప్రాణనాధ పురుషోత్తమ
ఆలస్యమేలరా ఆనతినీయ్యరా దేవా
కీర్తన 91
------------
లేడు లేడురా
నీ లాంటి దైవము ఈలోకంలో
ఎందెందు వెదికినా
ఏడేడు లోకాలు వెదికినా
లేడు లేడురా
నీ లాంటి దైవము ఏడేడులోకాలలో
పరికించి పరికించి
పదనాలుగు భువనాలు చూసినా
లేడు లేడురా
నీ లాంటి దైవము పదనాల్గుభువనాలలో
ఎంత భాగ్యమురా దేవా
ఏడుకొండలలో వెలసినావు
ఎనలేని వరాలు నొసిగినావు
ఏడుతరాలకు బంధమేసినావు
ఏడుకొండల వాడ..లేడు లేడురా
నీ లాంటి దైవము ఏడేడులోకాలలో
కీర్తన 90
------------
అటు చూస్తే గోదారి
ఇటు చూస్తే భద్రగిరి
నామనసే ఆ మెట్టు పైన
నేనేమో ఈ గట్టు పైన
ఎగెరెగిరి రావాలని
నీచెంత చేరాలని
నీపాటలు పాడాలని
నీఆటలు ఆడాలని
కలలెన్నో కన్నాను రామ
హరే హరే హరే రామ
కన్నులతో కౌసల్య రామున్ని కట్టేసి
గుడిలో దేవుణ్ణి గుండెల్లో దాచేసి
ప్రాణంతో జ్యోతిని వెలిగించి హారతినై
హరినామస్మరణలో కరిగిపోనా రామ ....
కీర్తన 89
------------
మోగించరా మోగించరా
మారుమోగించరా గోవిందనామస్మరణ
స్మరించరా స్మరించరా
సర్వదా శ్రీహరిసహస్రనామస్మరణ
ఘడియ ఘడియకి గోవిందనామము
నిమిష నిమిషానికి నారాయణనామము
క్షణము క్షణమున శ్రీహరినామము ||స్మరించరా||
రేయినంతా రామనామము
పగలంతా పరంధామునినామము
బ్రతుకంతా భద్రాద్రిరామునినామము ||స్మరించరా||
ఆద్యంతము ఆనందమే
ప్రతినిత్యము పరమానందమే
అనునిత్యము మధురానందమే ముక్తిదాయకమే
మోగించరా మోగించరా
మారుమోగించరా గోవిందనామస్మరణ

కీర్తన 88
------------
నాది నాదియని పాకులాడకు నరుడా
నాదన్నది నేలమీద నేదిలేదు నరుడా
నీది నాది నగనగవుల నాటకమె నరుడా
మట్టిబొమ్మలాటలో మురిసిపోకు నరుడా
మహావిష్ణుమాయని మరచిపోకు నరుడా
బంధాలని భవములు బాపుకోకు నరుడా
చూసినదల్లా నిజము కాదు నరుడా
చేసినదల్లా నీతోడుగ రాదు నరుడా
సిరిసంపదలతో సుఖము రాదు నరుడా
చివరకు శ్రీహరి చిత్తమె శరణం నరుడా
నాది నాదియని పాకులాడకు నరుడా
నాదన్నది నేలమీద నేదిలేదు నరుడా
కీర్తన 87
------------
చూడు చూడు సిన్నక్క
చూడ ముచ్చటైన సిన్నోడిని
సప్తగిరుల పైన ఆ చందురోడిని
సుక్కల్లో సక్కాని సుక్కవాడు
సూడబోతే ముద్దైన చిన్నవాడు
సీరలతో చిటారికొమ్మన చేరినాడు
ముగ్గురమ్మల ముద్దుల తనయుడు
మాట తప్పనోడు మడమ తిప్పనోడు
ముల్లోకాల నేలే మహారాజు వాడు
సిర్రెత్తితే సింహమల్లె దూకుతాడు
స్మరిస్తే సల్లనికుండై సేదతీర్చుతాడు
సిలిపిచేష్టలతో సందడిసందడి చేస్తాడు
కీర్తన 86
------------
దేవుడు ఉన్నాడా లేడానంటె
వున్నాడంటే వెంటేనన్నాడు
లేడంటే లేనే లేనన్నాడు
నమ్మకము నున్న వారికి
నుపకారముచేయు నారాయుణుడు
కంటికి కనురెప్పలా కాపాడుతానన్నాడు
అపనమ్మకము నైనా వారికి
అపకారము తలపెట్టనన్నాడు
కలలోనైనా కష్టపెట్టనన్నాడు
శ్రద్దాభక్తులతో సేవిస్తే
చింతలేని సుఖాలునిస్తానన్నాడు
సన్నిహితుడై చెంతనుంటానన్నాడు
అశ్రద్ద చేయు వారిని
ఆపదలెల్ల ఆదరిస్తానన్నాడు
తనదారికి మళ్లించుకొంటానన్నాడు
నమ్మర నరుడా నారాయుణుడిని
వేడర వరుడా వెంకటేశుడిని
హరుడైనా సేవించు హరినారాయునుడని .
కీర్తన 85
------------
కొండనెక్కు వేళ ఏడుకొండలెక్కువేళ
తోడుగ వచ్చేనే స్వామి తిరుమలయ్య
నీడగనొచ్చేనే స్వామి వేంకటరమణయ్య
మెట్టు మెట్టుకు గోవింద లెట్టి
కొండ కొండకు దండము నెట్టి
మొక్కుతో మోకాళ్ళపర్వతము దాటి
తిరుమల చేరి తత్వము నెఱిగి తలనీలాలిచ్చి
విశ్వాసముతో స్వామి వడ్డీకాసులు చెల్లించి
ఇహము పరము మరచి నిలివుదోపిడినివ్వగా
నాభక్తిని మెచ్చావు ఎన్నో వరాల నిచ్చావు
ఏకాంతసేవలో వేంకటేసా విశ్వరూపం దర్శనమిచ్చి
చెంతచేర్చుకొని సేవలో జన్మతరింప జేసీతీవీ స్వామి



కీర్తన 84
------------
ఎదురుగా నీవుంటే కనులే కలిసెనులె
ఎక్కడో నీవుంటే భావాలే కలిసెనులె
మదిలొ నిన్నే తలచెనులె
మనసులు రెండు కలిసెనులె
తనువులు ఒకటిగా చేసెనులే
హ్రుదిలొ నిన్నే నిలిపెనులే
ఎదురుగా నీవున్నా రాకున్నా లేకున్నా
ఎన్నెన్ని భావాలో ఎల్లలులేని బంధాలో
ప్రతిక్షణము పరితపించే ప్రేమానురాగాలో
అనుక్షణము గుర్తుచేసే అరవిందునిఅందాలో
లవ్ యూ లవ్యూరా ఓ లలనా
నా మదియంతా నీవేరా మదనా
నా మనసు నీకేరా నందనందనా
వృందావనానికి రావా వెన్నెలవదనా ..

కీర్తన 83:
------------
ఏమని పిలిచేది స్వామి
నిన్నేమని పిలిచేదీ స్వామి
ఏల కొలిచేది స్వామి
నిన్నెలా కొలిచేది స్వామి
ఏమని పిలిచిన పలికేవు స్వామి
ఏల కొలచిన కరిగేవు స్వామి
గోవిందుడై నాగుండెలో ఇమిడినావు
గానమై నాగళములో నడయాడినావు
కీర్తనై నాకలములో నాట్యమాడినావు
కానీ నీకు నాకు ఎంతో దూరం
ఏనాడూ కల్గునొ నాస్వామి అనుగ్రహం

కీర్తన 82:
------------
చల్లాచల్లని దైవమా
చల్లగుండుట భావ్యమా
నల్లానల్లని మోహమా
మెదలకుండుట న్యాయమా
కారణంబుతో కొలచినా
కోమలి ఎకరవు పెట్టినా
ఉలుకక పలుకక మెదలక
నిమ్మకు నీరెత్తి నట్టుగా
చిరుమందహాసముతో శిలగా
నిలుచట న్యాయమా భావ్యమా
కీర్తన 81:
------------
చిన్న చిన్న దేవుళ్ళు
చిల్లర మల్లర దేవుళ్ళు
చేయి చాపు దేవుళ్ళు
శత కోటి దేవుళ్ళు
ఊరంతా ఉత్తొత్తి దేవుళ్ళు
వాడంతా విభూధి దేవుళ్ళు
ఇల్లంతా పటాల దేవుళ్ళు
మూలము మరచి మనీకి వెరచి
చిత్ర విచిత్ర వేషాలకి మురిసి
చేయికాలిన తరుణాన ఆకుపట్టిన
సందాన చివరకు శ్రీహరిని సేవించేరు...
మనసా ఎరుగవే ఏడుకొండల వాడిని
మరువక తలవవే ఏడేడుకొండల వాడిని

కీర్తన 80:
------------
నమస్తే నమస్తే నారాయణా
నా నేస్తం సమస్తం నీవే శ్రీమన్నారాయణా
మమ్మేలు మముబ్రోవు నారాయణా
సకలం సర్వం నీవే శ్రీమన్నారాయణా
చీకట్లను చెరపి చింతలను మాపి
సర్వదా వెలుగునిచ్చు సూర్యనారాయణా
మొక్కును ఇచ్చి మమ్ము మెచ్చి
వెన్నెల వరాలనిచ్చు వెంకటనారాయణా
కంటకాలు తొలగించి కన్నీళ్ళు తుడిచి
కోరికలు తీర్చే కలియుగనారాయణా
చక్రము ధరించి గజేంద్రుని రక్షించి
పాపాలను హరించే హరినారాయణా
నమస్తే నమస్తే నారాయణా
నా నేస్తం సమస్తం నీవే శ్రీమన్నారాయణా
కీర్తన 79:
------------
మా అమ్మకు అమ్మవు నీవయ్యా
మా అయ్యకు అయ్యవు నీవయ్యా
మా బంధాలకు బంధువు నీవయ్యా
మా అనుబంధాలకు అత్మీయ్యుడవు నీవయ్యా
ప్రాణాలకు మిగుల ప్రాణము నీవయ్యా
దిక్కులకు దొడ్డ దిక్కువు నీవయ్యా
దివిలో వెలిగే దీపం నీవయ్యా
భువినే మోసే విభుడవు నీవయ్యా
మా ఇలవేలుపు నీవయ్యా
రాముడవైనా కృష్ణుడవైనా నీవేనయ్యా
ఏడుకొండల వేంకటరమణయ్య
ఏడేడుకొండల వేంకటకృష్ణయ్యా ....

కీర్తన 78:
------------
కొలిచేది కొంత తరుణమైనా స్వామి
కొండంత కరుణించితివి స్వామి
తలిచేది తరుణమైనా స్వామి
తోడునీడనై కాపాడితివి స్వామి
ఈ జన్మకు మూలమై ఈ ప్రాణికి ప్రాణమై
ఈదేహంపై దయుంచి దర్శనభాగ్యం నిచ్చి
నా కనులకు కనిపించవా తిరుమలస్వామి
తలనీలాలకే తృప్తిచెంది తీయ్యని
వరములు నొసగే తిరుమలస్వామి
అప్పుడపుడు చేయు ఆలాపనకే
ఆదరించి ఆపదలందు ఆదుకొనే స్వామి
వినరావా నావిన్నపము ఏడుకొండలస్వామి
వినినంతనే వేగరావ,బేగ నను చెంతచేర్చుకొని
ఏకాంతసేవను క్షణమైనా వీక్షించనీవా స్వామి
వేంకటేశుని సన్నిధిలో ఈజన్మ తరించిపోనీ స్వామి
కీర్తన 77:
------------
నీ అధరం ఆమురళికి మధురం
నీ ఉదరం బ్రహ్మండాలకు ఆధారం
నీ సౌందర్యం వృందావనానికి సుందరం
హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే.....

కీర్తన 76:
------------
పలికేది రామనామం
పాడేది వేణుగానం
ప్రణామం నమోవెంకటేశం
ప్రాణం శ్రీనివాసునిసకీర్తనం...
కీర్తన 75:
------------
రామా రామా అంటూ శ్రీరామ సీతారామ నంటూ
అడుగునఅడుగేసికొంటూ ఆమడలు నడుచుకొంటూ
గోదారి గట్టు దాటినాను భద్రాద్రి మెట్టు చేరినాను
హనుమంతుడొచ్చి హృదయానికి హత్తుకొనగా
గరుక్మంతుడు గబగబనొచ్చి గుడి తెరచినాడు
లక్ష్మణుడు లోనికి రమ్మని ఆహ్వానించినాడు
సంతసమ్ముతో సీతమ్మతల్లి చెంతచేర్చుకొనీ
ఆదరించి అలసటను తీర్చి అమ్మనై ఆకలితీర్చి
కష్టమేలనయ్యా కొలిచిన మేమురామానని వారించి
అయ్య చెంతకు రామయ్య చెంతకు నన్ను చేర్చినాది
రామదాసు రామకీర్తనలు ఆలపించగా
తానీషా తారకరాముని తీర్ధము ఇవ్వగా
కలువులరేడు కౌసల్యరామయ్య కరుణించినాడు
దశరధరామయ్య దశావతారకరాముడై దర్శనమిచ్చాడు
కీర్తన 74:
------------
వేవేల దండాలు వెంకన్నా
శతకోటి దండాలు శీనన్నా
సిరివి హరివి నీవే శీనన్నా
నీసాయం సాటిలేనిదన్నా
సాయానికి శతకోటిదండాలు శీనన్నా
వేదం విశ్వం నీవే వెంకన్నా
నీవిశ్వాసం వెలకట్టలేనిదన్నా
విశ్వాసపాత్రునికి వేవేలదండాలు వెంకన్నా
నీకు వేడుక మాకు వరము వెంకన్నా
నీకు సేవ మాకు సంబరము శీనన్నా
దాసుని దండదండాలు దశావతారకరామన్న

కీర్తన 74:
------------
కులుకేలరా నీకు తళుకేలరా
కోరి కోమలి కబురంపగా.. జాగు
చేయక వేగరారా బేగరారా కృష్ణా...
కనులెదుట నిలిచి కవ్వించినావు
కలలోన కౌగిలిలో కరిగించినావు
ఊసులన్ని ఉసిగొల్పి ఆశలన్ని నాలోరేపి
ఉహలలో జాణతో వేణువై ఊరేగినావు ||కులుకేలరా||
మదిన దూరి ఎదను దోచి
వయసుతొ చేరి మారాము చేయకురా
మనసును మందిరముగా మలచితిరా
పూలపందిళ్ళు వేసి ప్రేమతో పిలిచితిరా
కులుకేలరా నీకు తళుకేలరా
కోరి కోమలి కబురంపగా.. జాగు
చేయక వేగరారా బేగరారా కృష్ణా.
కీర్తన 73:
--------------
వరములు నొసగాలంటే
సిరులు పొందాలంటే
పాపాలు హరియించాలంటే
భక్తితో హరిని కొలవవో మనసా
ఆర్తితో శ్రీహరిని తలవవొ మనసా
వరములు వరహాలై వర్షించునులే
సిరిసంపదలు ఇంట పొంగిపొరలేనులే
పాపాలు పావనగంగలో కడిగేనులే
భక్తితో హరిని కొలవవో మనసా
ఆర్తితో శ్రీహరిని తలవవొ మనసా
కీర్తన 72:
--------------
తిరుమలలో కొలువైన తిరుత్తుణి స్వామి
తెరలు తొలగించు తరుణం ఇదే స్వామీ
తెలియని వారికి తెలుపగరారా స్వామీ
నేల పరిచింది పూలబాట నీ నడకకు
గాలి పాడింది స్వాగతాలు నీ రాకకు
నింగి వర్షించింది వెన్నెల నీ కొలువుకు
కోరకనే వరాలిచ్చి కొండంత వెలుగు నిచ్చి
మమతెరిగిన దేవుడవై మనసున్న మాధవుడై
కదలిరారా స్వామి కదలిరా కొండలరాయుడవై కదలిరా


కీర్తన 71:
--------------
రాయె రాయె రత్తమ్మ రామలోరి గుడికమ్మొ
రాయె రాయె రత్తమ్మ రామలోరి గుడికమ్మొ
రంగురంగుల రాట్నము నెక్కిస్తా
రంగురంగుల గాజులు కొనిపెడతా
రఘుకుల రాముడు దశరధరాముణ్ణి చూపెడతా || రాయె రాయె||
విల్లునే విరిసినాడు మనసునే దోచినాడు
దండనే వేసినాడు సీతనే పెండ్లాతున్నాడు
సీతారాములు కళ్యాణ వైభోగమంట
పిల్లాజల్లా ఊరువాడా సంబరమంటా
నింగినేలలో నెన్నడు జరగని జాతరనంట || రాయె రాయె||
కొలుసు కొంటె కట్టాలు తీరుస్తాడంట
నమ్ముకొంటె నీడలా ఉంటాడంట
భజన చేస్తే బాధబంధీలు లేనేలేవంట || రాయె రాయె||
రాయె రాయె రత్తమ్మ రామలోరి గుడికమ్మొ
రాయె రాయె రత్తమ్మ రామలోరి గుడికమ్మొ



కీర్తన 70:
--------------
అన్నింటికి నేనే మూలం
జగమంతటికి నేనే జీవం
జననం మరణం సహజం
జీవిత గమ్యం దానంధర్మం
మళ్లీమళ్లీరాదు మానవజన్మం
మర్మమెఱిగి ఎంచుకో మంచిమార్గం
పదిమందికి సాయం దైవత్వం
పరమాత్ముని ప్రార్ధన పరమోన్నతం
అదే నీ కర్తవ్యం ..జీవిత సాఫల్యం..
నలుగురికి ఆదర్శం.. ఈ జన్మ రహస్యం ..
కీర్తన xx:
--------------
ఎందరో ఎందరెందరో వారెందరో
ఆకలితో అలమటించు వారెందరో
ఆదరణను నోచుకోని అనాధలెందరో
ఆధర్మానికి బలియైన అభాగ్యులెందరో
ఎందరో ఎందరెందరో వారెందరో
విధిరాతకు విలవిలలాడిన వారెందరో
విలయాలకు అశువులు బాపినవారెందరో
వింతవింతబాధలతో బాధపడ్డ బిడ్డలెందరో
ఎందుకో ఏమిటో ఈవింతవింతలు
మున్నాళ్ళ ముచ్చటకే ముప్పతిప్పలు
మార్చలేవా మారాతలు తలరాతలు
మహాత్మా సరిచేయలేవా మాబ్రతుకులు..
కీర్తన 69-
--------
ప్రేమతో పలుకవే ప్రేమనే పంచవే
ప్రియురాల.. జవరాల.. ఓ ఆలిమెలా
ప్రేమతో పలుకవే ప్రియురాల
ప్రేమనే పంచవే జవరాల ...
అమ్మనై లాలించవే అలిమేల
ఇల్లాలివై ఒడినియ్యవే ప్రియురాల
ప్రియుని అధరానికి పల్లవై
మగడి మనసుకి మధురిమై
చెలికాడి చేయివిడువని శ్రీవల్లివై
తోడువై నీడవై వీడరాని జంటనై
కలకాలం చిరకాలం కలిసి మెలిసి
పాలలో నీళ్ళలా కొలనులో కలువలా
చిలకా గోరింకలా గూడున ఒదిగిపోవే...
పతియే దైవమని పసుపుకుంకమ పవిత్రమని
పుట్టింటికి మెట్టింటికి అదియె గౌరవమని
మసలుకోవే నీ ఇల్లే కోవెలగా మలచుకోవే...
కీర్తన 68:
----------
మదిలో ఒకరు... ఎదలొ ఒకరు...
ఎలపట ఒకరు.. దాపట ఇంకొకరు...
ఇంటిలో రాముడు వీధిలో కృష్ణుడై
నెరజానల నడుమ నారాయుణుని నాటకం
వయ్యారి భామలతో వేంకటేశుని విడ్డూరం
శ్రీదేవి సింగారము చూసి సంబరపడగా
భూదేవి బంగారము బుంగమూతినాయే
ఆదిలక్ష్మి ఆందాలతో ఆనందమవగా
ఆలిమేలుమంగ అలకపాన్పు నెక్కినే
శ్రీదేవి కస్సులాడేనే భూదేవి బుస్సుకొట్టేనే
రామరామ ఇపుడేమిచేతువు రా వెంకటరామ
ఇరువురిభామల కౌగిలిలో ఇరుకునపడితీవే రామ
జోడెడ్దుల బండిమీద జోరుగా సాగుతున్నావనుకుంటినే
జోరీగల్లే జాణల జగడాలతో బేజారునైతివే రామరామ
రామరామ అయ్యోరామరామ ఏడుకొండల వెంకటరామ...
కీర్తన 67:
-----------
రామ నామము కంఠె
వేణు గానము వింటే
సరిగమలన్ని సరసాలాయే
రాగాలన్ని రసమయమాయె
రామా నీనామం మాధురాతిమధురం
శ్యామా నీగానం నవరసనాట్యభరితం
సప్తస్వరముల సుమధురసంగీతం
సహస్రసరాగాల రాగరసమయరజితం
రామా నీనామం నిత్యనవనీతం
శ్యామా నీగానం గాన గంధర్వం
మృదంగములు తానాతందానం
వాయిద్యాలు వేదతాండవం
రామా నీనామం మాధురాతిమధురం
శ్యామా నీగానం నవరసనాట్యభరితం


కీర్తన 66:
-----------
నల్లానల్లని దైవమా తెల్లాతెల్లని మేఘమై
చల్లా చల్లని వరాలఅమృతమై కురియుమా
తీరనిదాహము తీర్చుమా దరి చేర్చుమా
నల్లని వన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని
నమ్మిన వాడిని మంచిచెడు తెలియనివాడిని
నారాయణుడే దైవమని నమ్ముకొన్నవాడిని
కడలి లోతు కష్టాలు కడుపులో దాచుకొన్నా
ఎండమావులని ఎరుగక ఎడారిలో ఎదురోతున్నా
గమ్యం తెలియని గగనాన పతంగమై ఎగురుతున్నా
నల్లానల్లని దైవమా తెల్లాతెల్లని మేఘమై
చల్లా చల్లని వరాలఅమృతమై కురియుమా
తీరనిదాహము తీర్చుమా దరి చేర్చుమా
కీర్తన 65:
-----------
చేసిన బాసలు చూడకురా
నెరుగని తప్పులు దండించకురా
కొండంత మనసుతో కరుణించారా
అండ దండా నీవై మము కాపాడరా
ఓ కొండదేవరా కరుణ బ్రోవరా
ఓ వెంకటేశ్వరా వెతలు బాపరా
ఓ హరిహరేశ్వరా పాపాలు హరించరా
ఓ పరమేశ్వరా ముక్తి ప్రసాదించారా
ఏలినాటిదైవమా ఏడుకొండల ప్రత్యక్షదైవమా
వెసులుబాటు లేదు వడ్డీకాసులు అడుగకురా
సిరి సహవాసముతో మా ఇంట చేరరా
సదా సేవలు అందుకొరా మాఇల దైవమా

కీర్తన 64:
-----------
అన్నమయ్య ప్రతి పదము
కమ్మనైన ప్రీతి ఫలము
అరుదైన అంత వరము
ఎన్ని జన్మలెత్తినా ఎంత వేడినా
దొరుకునా అమృత పదఫలము
అనంతపద్మనాభుని అంశము
పూర్వజన్మ సుకృతము
మాతృపితృదేవుల పుణ్యఫలము
ఆలిమేలమంగపతుని ఆశీర్వాదము
పుడమిన వికసించిన పారిజాతము
సప్తస్వరముల సంగీత సాగరము
వీనులకు విందైన వేణుగానము
పురుషోత్తమునికి పదకవితార్చనము
కీర్తన 63:
-----------
దర్శనం స్వామి సర్వదర్శనం
ఎన్నటికీ మరుపురాని జ్ఞాపకం
పరిచయం విభుని తొలిపరిచయం
భవతీరాలను దాటించు అతిశయం
తలవని తలవంపుగా తనివితీరా
తిరుమలేశుని తిలకించడం
జన్మజన్మలకు దొరకిన పుణ్యఫలం
కోరినా కోరకున్నా
కమలనాధుడు కలసిరావడం
ఈజన్మకు కలిగిన భాగ్యం
ఆజన్మాతం తీర్చుకోలేని రుణం || దర్శనం||
కీర్తన 62
-----------
ఎన్ని లీలలో ఎన్ని మాయలో
ఎన్ని కథలో ఎన్ని కళలో
కనులకు ఏమి తెలుసు
జనులకు ఏమి తెలుసు
దేవదేవుని దివ్యలీలలు
మహాదేవుని మహామాయలు
కనులకు ఏమి తెలుసు
జనులకు ఏమి తెలుసు
ఆత్మలో నిక్షిప్తమైన
పరమాత్ముడే పరమోన్నతుడని ఎరుగని
పరంధాముని లీలలు పరమాత్ముని మాయలు
ఆత్మకు ఏమి తెలుసు
జీవాత్మకు ఏమి తెలుసు
కనవే మనసా ఎరుగవే జీవమా
ఏడుకొండల వేంకటేశుని లీలలు
వైకుంఠవాసుని మాయలు....
కీర్తన 61
-----------
అయ్యా ... అయ్యా ... పెద్దయ్యా
అయ్యా... అయ్యా ... దొడ్డయ్యా
అఖిల జగాలకు అయ్యవైన పెద్దయ్యా ...
అయ్యలకే అయ్యవైన ఓ పెద్దయ్యా...
దిక్కులకే దేవుడవయ్యా ఓ దొడ్డయ్యా
ఏడేడు లోకాలు పదనాలు భువనాలు
పాలించే ఏడుకొండల వెంకయ్యా
అనంత లయలకు ఆద్యుడవై
పాండవ పోరున పార్ధ సారధి వై
వైరాగ్య సమయాన గీతానందుడవై
పాలించే పరిపాలించే అయ్యా ఓ పెద్దయ్యా...
ఆదరించి మము ఆదుకోవయ్యా వెంకయ్యా...


కీర్తన 60
-----------
నడచినాను నీదారిలో....
నమ్మి నడచినాను నీదారిలో
భక్తిమార్గమే ముక్తిమార్గమని
శ్రీహరిని చేరుటకు శ్రేష్టమార్గమని ||నడచినాను||
నీ రూపమే ప్రాణమని
నీ నామమే గానమని
తలచినాను బహు రూపాలు
కొలచినాను బహు నామాలు ||నడచినాను||
నీ దీవెనలు నా దారి వెలిగించగా
ఆ వెలుగులో నేను పయనించగా
చేరుకోనా శ్రీనివాసుని సన్నిధిని
నే మిగిలి ఉంటాను నీసేవకుడిగా ||నడచినాను||

కీర్తన 59
-----------
భజన చేసితిని ఇన్నాళ్లు
భరోసా ఇచ్చుటకు ఎన్నాళ్లు
భద్రాచలరామ నాకేల ఈకన్నీళ్ళు
భరించలేను వర్ణనాతీత బాధలు
నన్ను బ్రోచి మొక్కు తీర్చగరారా రామ
నను కాచి కష్టాలు కడతేర్చగరారా రామ
నా భక్తి పుష్పం సుమించి ఫలించునా
ఆభగవంతుని ఆశీస్సులు పొందునా
చెప్పలేను రామా విధీయ్య మౌన భావం
చేరదీయ్యగరారా రామ ఈ మంత్రపుష్పం

కీర్తన 58
-----------
నిను నమ్ముట శరణ్యం
నిను చేరుట సంకల్పం
చూపర దేవా త్రొవ
కరుణతో నను బ్రోవ
ఒదిగిఒదిగి దేవా వందనం
కలిగించర దేవా నమ్మకం
భోధించరా దేవా తొలిబడివై
చేర్చుకోరా దేవా అమ్మఒడినై
దేవం భజే వందే వాసుదేవం
దేవదేవం హరే వందే వెంకటేశం

కీర్తన 57
-----------
అడుగడుగో అందాల చందమామ
ఇడుగిడుగో చందనాల సీతారామ
మచ్చలేని మేనమామ మాచందమామ
మాటతప్పని ముకుందరామ సీతారామా
పండువెన్నెల చిగురించే పున్నమిమామ
పాపాలను హరించే పతితపావనసీతారామ
చల్లని వెలుగుల దారిచూపు చందమామ
చల్లని దీవెనలు నిచ్చిపంపు సీతారామా
నీలిమఘాల మాటునదాగిన చందమామ
రా రావోయి ఈవేళ అందాల చందమామ
నిండుకొండనై తొణకని నీలమేఘ శ్యామ
రావోయిరామ మాఇంటిదాకా సీతారామా

కీర్తన 56
-----------
సారు ఏడుకొండల సారు
మీరు భలే మంచి వారు
వెన్నలాంటి మనసున్నవారు
వెన్నెలలా చల్లంగా చూసేటివారు
సారు ఓసారు ఏడుకొండలసారు
కరుణించి ఓసారి కానరావా సారు
కొండంత కరుణ కలిగినవారు
సాగరమంత శాంతమైనవారు
ధర్మము తెల్పి మహిమాన్వితులైనారు
ధరణిని కాపాడి మాకు దైవమైనారు
సారు ఓసారు ఏడుకొండలసారు
దయుంచి ఓసారి దర్శనమీయ్యండి సారు
ఆజన్మాంతము రుణపడియుంటాము సారు
కీర్తన 55
-----------
కౌసల్యరాముడే మా కులదైవము
కొండలరాయుడే కలియుగదైవము
నమ్మిన నమ్మకముగా నిలిచే విభు
నారాయుణుడే మా నిజదైవము
పరులు పాపులు పుణ్యులకు పలికే
పురుషోత్తముడే మా పరమదైవము
ఎల్లవేళలా వెన్నంటి కాపాడేవాడు
వెంకటేశ్వరుడే మా ఇలదైవము
ఆకటివేళ ఆదరించి అక్కునచేర్చుకొను
అలిమేలమంగపతుడే మా ఆత్మీయ్యదైవము
ఏడుకొండలవాడ వెంకటరమణ
సంకటహరణా గోవిందా హరి గోవింద!!!
కీర్తన 54
-----------
విష్నుం జిష్నుం వందే వాసుదేవం
వేదం నాదం ఓంకార ప్రణవనాదం
శంఖం చక్రం ఖడ్గదధారి చతుర్భుజం
రామం కృష్ణం నారాయణం నమో స్తుతే ||
భవ భయ హరణం భూతనాదం
వరం కరం తిరువేంకటగిరి నివాసం
ప్రశీదం ప్రాణామం పద్మనాభం
శరణం శరణం శ్రీనాధం ప్రభద్దే ||
అఖిలం నిఖిలం ఆధారనిలయం
అండపిండ బ్రహ్మాండ నాయకం
సహస్రనామం శ్రీనిధిం శ్రీనివాసం
త్రిలోకాత్మం త్రిలోకేశం తిరునామం ప్రభద్దే ||
కీర్తన xx
-----------
నోచినాను నోములెన్నో
చేసినాను పూజలెన్నో
ఆదైవమే పతిదైవమని
నీబంధమే పవిత్రబంధమని || నోచినాను||
కన్నాను కలలెన్నో
పాడాను పాటలెన్నో
శ్రీనాధుడే నానాధుడని
పతితపావనుడే ప్రాణనాధుడని || నోచినాను||
పలు సుగుణాల చెలికాడు
చెరగని నగవుల నెలరేడు
నాకు నాధుడు కావాలని
నాలో సగమై నిలివాలని || నోచినాను||
కీర్తన 44Z
------------
భూమి బీడుబారె
మాను మోడుబారె
నిలువ నీడలేక
గుక్కెడు నీరులేక
ఆశలు ఆవిరాయే
జీవితాలు భారమాయే
ఊరు వదలిపోయే ...
వలస వెళ్ళిపోయే
వాడ వెలవెలబోయే
పల్లె చిన్నబోయే
దేవుడా నీవెక్కడా
దీనుడకు దారెక్కడా
పేదోడికి వెలుగునెక్కడా
కరువుకి నీకరుణనెక్కడా
ఎక్కడా నీవెక్కడా ....
ఏడుకొండలవాడ నీవెక్కడా ....
కీర్తన 44Y
------------
నిగనిగలాడే నీ మేని అందం
మిలమిలలాడే నా మససుకే సొంతం
కళకళలాడే నీ కలువుల నయనం
కిలకిలలాడే నా గానానికే బంధం
సిగసిగలాడే నీచలువరాతి సౌందర్యం
ఘుమఘుమలాడే నావలపుకే చందనం
గలగలలాడే నీ గాజుల గానం తానం
ఘల్లుఘల్లుననాడే నా అందెలకే సంగీతం
పెటపెటలాడే నీపూలపైట ప్రణయం
రెపరెపలాడే నావయసుకే పరిణయం .
రావే రాధా నాధునికై, రాగానికే అనురాగమై
ప్రాణానికే ప్రాణమై, బంధానికే అనుబంధమై
నాలో సగమై రాధమాధవుడనై నిలిచిపోనీవే....
కీర్తన 44X
------------
సంతోషమే సంతోషమే కదరా
శ్రీనివాసా సప్తగిరులు చేరుట
సంతోషమే సంతోషమే కదరా
శ్రీనివాసా నిను సందర్శించుట
ఉషోదయవేళలో సుప్రభాతసేవలో
తిరుమలేశుని తిలకించుట తీయ్యనైన
తీపి జ్ఞాపకం పూర్వజన్మ సుకృతం
ఈజన్మకు సంతోషమే సంతోషమేకదరా
నీచింతన చేసుకొంటూ నీవంత పాడుకొంటూ
సాగరాలు దాటి శ్రీనివాసుని సన్నిధిని చేరి
కళ్యాణవైభోగము కనులకు కట్టినట్లుగా చూచుట
సంతోషమే సంతోషమే కదరా శ్రీనివాసా
కీర్తన 44W
------------
వైరమేల నాతో వైకుంఠపాళీ
వందనాలు నెట్టి వేడుకొంటిని
వైరమేల నాతో ఏడుకొండల స్వామి
ఏడుకొండలు ఎక్కివస్తిని
ఎట్టిచాకిరి చేస్తనంటిని
ఏడుకొండలవాడు నాదైవమంటిని
పంచచేరి నీ చెంతనుంటూ
నిన్నే చూసుకొంటూ
నీ సేవ చేసుకొంటూ ఉంటాను స్వామి
కోరరానిది కోరను స్వామి
తీర్చమనినిను అడగను స్వామి
గుడిలో కైనా రానేరాను స్వామి
నీ గానము చేసుకొంటూ
నీ నామము తలచుకొంటూ
నీ భజనలు చేసుకొంటూ
హరి నామస్మరణలో లీనమై
నా ప్రాణమే నీకు హారతిగా నిచ్చి
ఏడుకొండలలో ఉండిపొతా స్వామి
కీర్తన 44V
------------

మేరే మన్ మే రామ్ హైరే
మేరే దిల్ మే రామ్ హైరే
రామ్ సె బోలో జై శ్రీరామ్ బోలో
జోర్ సె బోలో, ప్యార్ సె బోలో
మేరే భక్త్ భక్త్ మే బంధన్ హైరే
మేరా షక్తి షక్తి శ్రీరామ్ హైరే
రామ్ సె బోలో జై శ్రీరామ్ బోలో
జోర్ సె బోలో, ప్యార్ సె బోలో
జిందగీ జీవన్ జోష్ హోష్ రే
తక్‌లీఫ్, తంగ్-ఈ నరక్ దూర్ దూర్ రే
రామ్ సె బోలో జై శ్రీరామ్ బోలో
జోర్ సె బోలో, ప్యార్ సె బోలో
కీర్తన 54
-----------
పురుషోత్తమ పద్మనయన ప్రణయిని.
పసుపు కుంకమ ప్రప్రదాయ పద్మావతి
సిరు గిరి సుందరి శ్రీహరి హృదయనివాసిని
సకలలోకేశ సత్యపాలక శ్రీనాధ సహధర్మణి
అష్ట ఐశ్వర్య సంతాన అనుగ్రహ ప్రదాయిని
భక్త వరద ఉదార విశాల వసుధారిణి ....
ప్రణామం ప్రణామం ప్రసన్నాక్ష్య పద్మావతి
పాహిమాం పాహిమాం ప్రపురాణ పద్మావతి
కీర్తన 53
-----------
శ్రీలక్ష్మమ్మని శ్రీనివాసుడు బ్రతిమలాడే విధానము చూడండి
పలుకవే బంగారమా 
నవ్వవే నయగారమా
చిరునవ్వు నవ్వవే సింగారమా
ఆప్యాయత చూపవే అనురాగమా
అందాల కోమలమా ఆనంద భాష్యమా
ప్రేమతో పొసగవే పద్మపారిజాతమా
ఆ స్వర్గము వీడానే ఈ సిరికై వచ్చానే
ఏడేడులోకాలు వెదకి ఏడుకొండలు చేరానే
చేయిచాచి అడిగే వారెందరో
చేతులెత్తి మొక్కే వారెందరో
హరిని సిరికై చేయిచాచానే
చేరరమ్మన్నానే సింధూరమా
చెంత చేర రావే నీ చల్లని
వొడినీయ్యవే వయ్యారమా
ఈ హరికి సిరి నీవు తోడై
శ్రీహరి నై నిలిచిపోనీవే.....
పలుకవే బంగారమా
నవ్వవే నయగారమా
కీర్తన 52
-----------
ఈ జగతికి మూలం నీవు
ఈ జన్మకు ప్రాణం నీవు
నాధ జగన్నాధ హరిహరనాధ
ఏడుకొండల నాధ... శ్రీనాధ...
సత్యము నీవు ధర్మము నీను
జననం నీవు మరణం నీవు
సకలము సర్వము నీవే సర్వేశ్వరా....
హరిహరేశ్వరా శ్రీ వెంకటేశ్వరా ...
విధాతవు నీవు ప్రధాతవు నీవు
ప్రకృతి నీవు వికృతి నీవు ..
జీవాత్మా పరమాత్మానీవే పరమేశా ..
ఈశా పద్మపరమేశా వెంకటేశా ...
గోవిందా హరి గోవిందా
గోవిందా భజ గోవిందా
కీర్తన 51
----------
సుందరా అందరా
అందుకోరా సౌందర్య సింగారము
మురళీధరా మోహించరా
ముద్దాడరా మాధుర్య మందారము
మనసు ఉందిరా మమత పంచరా
మురళి ఊదరా మదిని మీటరా....
ప్రేమతో పరవశించి ప్రియుని అధరమందించరా
సుమధుర సోయగాలు సుమించనీరా ......
లోకాలనన్నీ మరచి గువ్వనై గగనానికెగసి
గోలోకమున గోపాలునితో జంటగా చేరనీరా ...
కలువకన్నుల కౌగిలిలో కరిమేఘమై కరగనీరా
మనసులోన మధురామృతభావాలు కురవనీరా...
మాధవా , మదనమోహన , ముకుందా, మురారి .....
అరవింద , గోవింద, గోపాల గోవింద , ర రా రే రా.......

కీర్తన 50
----------
సాయం చేత్తావా సాయం చేత్తావా సామి
సేతులెత్తి మీకు మొక్కుతున్నా సామి
కనుచూపు మేరలో దారి కానారాలేదయ్యో
దిక్కుమొక్కు లేక దండమెట్టి నానయ్యో
కష్టనష్టాల ఊబిలో కూరుకంటినేనయ్యో
గండము గట్టెక్కించే గోవిందుడవూ నీవేనయ్యో
సాయం చేత్తావా సాయం చేత్తావా సామి
సేతులెత్తి మీకు మొక్కుతున్నా సామి
ఆదుకొనేవారు లేరు ఆదరించేవారు లేరు
పలుకరించేవారు లేరు ప్రేమచూపేవారే లేరు
అలసిసొలసినాను సామి ఆదుకోరా సామి
ఆర్జించుచున్నాను సామి అభయమియ్యారా సామి
సాయం చేత్తావా సాయం చేత్తావా సామి
సేతులెత్తి మీకు మొక్కుతున్నా సామి
----------------------------------