కీర్తన 36
-----------
తోడుగ రావా స్వామి తిరుమలవాసా శ్రీవేంకటేశా
తీరము చేరుదాకా స్వామి తిరుమలవాసా శ్రీవేంకటేశా
-----------
తోడుగ రావా స్వామి తిరుమలవాసా శ్రీవేంకటేశా
తీరము చేరుదాకా స్వామి తిరుమలవాసా శ్రీవేంకటేశా
నడిపించగ రావ స్వామి బంగరు నావ
చూపించగ రావ స్వామి మేలైన త్రొవ
చూపించగ రావ స్వామి మేలైన త్రొవ
కరిమేఘాలు కమ్మి కారుచీకటులు ఆవరించినా
కరుణించని కల్లోల కడలి నావను కుదిపివెసినా
కరుణించని కల్లోల కడలి నావను కుదిపివెసినా
నిన్నే నమ్మితిని స్వామి నీ లీలేనని భరించితిని
నీగానములోమునిగితిని పయనం సాగించితిని
నీగానములోమునిగితిని పయనం సాగించితిని
నాకు మించిన పరీక్ష నీది నాభక్తి నీయందు ఏపాటిది
వెలుగునివ్వరా దారిచూపరా తిరుమలచేరనీరా దేవా
వెలుగునివ్వరా దారిచూపరా తిరుమలచేరనీరా దేవా
ఏడుకొండలవాడ వెంకటరమణ సంకటహరణ
గోవిందా భజగోవిందా...గోవింద హరి గోవిందా...
గోవిందా భజగోవిందా...గోవింద హరి గోవిందా...
No comments:
Post a Comment