Sunday, December 14, 2014

కీర్తన 32
------------
కలలో నైనా నిను కాంచక
ఇలలో నీఇచ్చను పొందక
కాలగమనముతో సాగుతింటిని
చక్రబంధములో తిరుగుచుంటీని
పూర్వజన్మను పాపాలను నెఱుగనైతిని
ఈజన్మలో నీమనసు మెప్పించనైతిని
హరిహరి నాపాపాలను హరియించి
శ్రీహరి నాహరిసంకీర్తనను ఆలకించి
దశావతారక రామ నాపై దయుంచి
ఏడుకొండల రామ నాకు కనిపించి
భవ బంధాల నుంచి దూరముచేసి
ననునీలో లీనము చేసుకోరా దేవా
ఏడుకొండల వెంకటరమణా గోవిందా
సప్తగిరుల సంకటహరణా గోవిందా !!!

No comments:

Post a Comment