Sunday, December 14, 2014

కీర్తన 35
-----------
అడుగున అడుగై నడవని
నీనీడన తోడల్లే నిలవని
నడవని నను నడవని
ఏడుకొండలకు నను నడవని
నిలువనీ నను నిలువని
ఏడుకొండలవాని నీడన నిలువని
భక్తి చెరసాలలో బంధీనవని
బంగారు కోవెలలో బంధమేయని
నిను చూడని మురిసి మురిసి పాడని
పలికించే ప్రతి లలితశ్రుతి నిను లాలించని
ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా
హరి గోవిందా గోవిందా హరి భజగోవిందా గోవిందా!!!

No comments:

Post a Comment