Sunday, December 14, 2014

కీర్తన 49
----------
హరి యన్న విత్తనం నాటి
హరినామం యన్న అమృతం పోసి
విభుయన్న చెట్టు ఏళ్లకొద్ది పెంచుకోంటిని
హృదయానికి హత్తుకొని సేవించుకొంటిని
పండించర దేవా నా భక్తిని
ప్రసాదించరా దేవా నాకు ముక్తిని
రాహువు కేతువు ఏల వస్తారోనని
రామనామము రక్షగా కడితిని
కంసుడి ఎక్కడ కబళిస్తాడొనని
క్రష్ణగీతిని కవచమల్లె కంచెవెసితిని
మరణం తుఫానులా తుంచకమునుపే
దావనంలా భక్తితోట దహించికముందే
పండించర దేవా నా భక్తిని
ప్రసాదించరా దేవా నాకు ముక్తిని
పండు పండి నీపాదాల చెంత రాలిపోనీ
ముక్తి సాగర తీరాన్ని చేరిపోనీరా దేవా
ఏడుకొండల వేంకటేశ
ఏడేడుకొండల వేంకటేశ గోవిందా
--------------------------------

No comments:

Post a Comment